బ్రేకింగ్ : చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తికి సీరియస్
చాలా సంవత్సరాలుగా రామ్మూర్తి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు.
చంద్రబాబునాయుడు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు(Ramamurthi Naidu)కు సీరియస్ గా ఉంది. చాలా సంవత్సరాలుగా రామ్మూర్తి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యం కారణంగానే జనజీవనస్రవంతికి కూడా దూరంగా ఉంటున్నారు. రామ్మూరి అనారోగ్యం ఏమిటన్న విషయాన్ని చంద్రబాబు(Chandrababu Naidu) కుటుంబసభ్యులు లేదా రామ్మూర్తి కుటుంబసభ్యులు బయటపెట్టడంలేదు. 1994 ఎన్నికల్లో చంద్రగిరి(Chandragiri) నుండి ఎంఎల్ఏగా గెలిచారు. తర్వాత ఎన్నికల్లో టీడీపీ(TDP) టికెట్ రాలేదు. అందుకనే టీడీపీకి రాజీనామా చేసి కొంతకాలం కాంగ్రెస్(Congress) పార్టీతో సన్నిహితంగా ఉన్నారు. తర్వాత నుండి అనారోగ్యం కారణంగా ఎవరికీ కనబడటంలేదు. చాలా కాలంగా ఎవరినీ రామ్మూర్తి గుర్తుపట్టడంలేదని సమాచారం. ఆయన కొడుకు నారా రోహిత్(Nara Rohit) సినీనటుడుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా అనారోగ్యంతో రామ్మూర్తి శనివారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. విషయం తెలియగానే ఏపీ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ కు బయలుదేరారు. మరిన్ని వివరాలు రావాల్సుంది.