KTR and Formula Case|కోర్టుల్లో కేటీఆర్ కు ఎదురుదెబ్బ ?
సుప్రింకోర్టులో దాఖలుచేసిన పిటీషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని కేటీఆర్ తరపు లాయర్ కు అర్ధమైపోయింది.
కోర్టుల్లో కేటీఆర్ కు ఎదురుదెబ్బ తప్పలేదు. కోర్టుల ద్వారా ఊరటపొందుదామని అనుకున్న కేటీఆర్ కు తీవ్ర నిరాస ఎదురయ్యింది. ఇపుడు విషయం ఏమిటంటే ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించి తనపై ఏసీబీ నమోదుచేసిన కేసును కొట్టేయాలని(Supreme court) సుప్రింకోర్టులో కేటీఆర్(KTR) వేసిన క్వాష్ పిటీషన్ను ఉపసంహరించుకున్నారు. బుధవారం పిటీషన్ విచారణ మొదలవ్వగానే కేటీఆర్ తరపు లాయర్ కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్లు చెప్పారు. ఎందుకు విత్ డ్రా చేసుకున్నారంటే(Telangana Highcourt) హైకోర్టు ఆదేశాల్లో జోక్యంచేసుకునేదిలేదని సుప్రింకోర్టు తేల్చిచెప్పింది కాబట్టే. దాంతో సుప్రింకోర్టులో దాఖలుచేసిన పిటీషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని కేటీఆర్ తరపు లాయర్ కు అర్ధమైపోయింది.
అందుకనే తాము కేసును ఉపసంహరించుకుంటామని చెప్పేశారు. ఫార్ములా కార్ రేసు(Formula Car Race case) నిర్వహణలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించటమే కాకుండా, అవినీతికి పాల్పడినట్లుగా ఏసీబీ కేసు నమోదుచేసింది. ఎప్పుడైతే ఏసీబీ(ACB Inquiry) కేసు నమోదుచేసింది వెంటనే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)(ED Inquiry) కూడా రంగంలోకి దిగేసి కేసులు బుక్ చేసి విచారణ కూడా మొదలుపెట్టేసింది. కేటీఆర్ తో పాటు అప్పటి ప్రిన్సిపుల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి మీద ఏసీబీ, ఈడీ కేసులునమోదు చేసి విచారణలు చేస్తున్నాయి. సుప్రింకోర్టులో కేసు విచారణ కారణంగా గురువారం ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అన్న సందిగ్దం మొదలైంది. అయితే తాజాపరిణామాల్లో ఈడీ విచారణకు కేటీఆర్ కు హజరవ్వక తప్పనిపరిస్ధితి ఏర్పడింది. విచారణ ఇంకా ప్రాధమిక దశలోనే ఉందికాబట్టి ఏసీబీ విచారణలో తాము జోక్యంచేసుకునేది లేదని సుప్రింకోర్టు చెప్పింది.
ఏసీబీ నమోదుచేసిన కేసును కొట్టేయాలని కేటీఆర్ వేసిన క్వాష్ పిటీషన్ను హైకోర్టు కొట్టేసింది. ఫార్ములా కార్ రేసు నిర్వహణలో అధికార దుర్వినియోగం, అవినీతి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లుగా ఏసీబీ ప్రాధమిక ఆధారాలను చూపించింది. దాంతో హైకోర్టు కూడా ఏసీబీ చూపించిన ఆధారాలతో కన్వీన్స్ అయ్యింది. అందుకనే కేటీఆర్ దాఖలుచేసిన క్వాష్ పిటీషన్నే కోర్టు కొట్టేసింది. రేసునిర్వహణలో అధికారదుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘన, అవినీతి జరిగినట్లుగా ఏసీబీ చూపించిన ఆధారాలతో కన్వీన్స్ అయినట్లు జస్టిస్ ప్రకటించారు. అందుకనే కేటీఆర్ మీద నమోదుచేసిన కేసును నిరభ్యంతరంగా విచారణ చేయచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టులో తన పిటీషన్ను కొట్టేయటంతో కేటీఆర్ వెంటనే సుప్రింకోర్టులో మరో క్వాష్ పిటీషన్ దాఖలుచూశారు. హైకోర్టు ఆదేశాల్లో జోక్యంచేసుకోమని సుప్రింకోర్టు చెప్పటంతో చేసేదిలేక వెంటనే కేటీఆర్ క్వాష్ పిటీషన్ను విత్ డ్రా చేసుకున్నారు.
ఏసీబీ చూపించిన ఆధారాలేమిటి ?
ఫార్ములా కార్ రేసు నిర్వహణలో అధికారదుర్వినియోగం జరిగినట్లు, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఏసీబీ పదేపదే చెబుతోంది. అదేమిటంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా హెచ్ఎండీఏ నుండి బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్(FEO) కంపెనీకి రు. 45 కోట్లను చెల్లించటం తప్పు. ఆర్ధికశాఖ, క్యాబినెట్ ఆమోదంలేకుండానే కోట్లరూపాయలు చెల్లింపులు చేయటం నిబంధనల ఉల్లంఘనే. అలాగే విదేశీకంపెనీకి విదేశీకరెన్సీలో చెల్లింపులు చేసేటపుడు ముందుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)(RBI) నుండి అనుమతి తీసుకోవాలి. అయితే ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే రు. 45 కోట్లను హెచ్ఎండీఏ చెల్లించింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆర్బీఐ విధించిన రు. 8 కోట్ల జరిమానాను తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సొచ్చింది. తప్పుచేయకపోతే ఆర్బీఐ తెలంగాణా ప్రభుత్వానికి ఫైన్ ఎందుకు వేసినట్లు ? ఆర్బీఐ వేసిన ఫైన్ను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చెల్లించినట్లు ?
ఫార్ములా కార్ కేసు నిర్వహణలో ఎలాంటి అవినీతి జరగలేదని, నిబంధనల ఉల్లంఘన ప్రశ్నేలేదని కేటీఆర్ కొట్టేస్తున్నారు. అయితే మీడియాతో ఎన్ని మాట్లాడినా అధికార దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘన జరిగిందో లేదో కేటీఆర్ కు బాగా తెలుసు. ఫార్ములా కార్ రేసు కేసులో ఏసీబీ చూపించిన పై ఆధారాలతో కోర్టు పూర్తిగా ఏకీభవించింది కాబట్టే విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి విచారణలో ఏమవుతుందో చూడాలి.