
ఏడుగురు మావోలు లొంగుబాటు
ములుగు ఎస్పీ ఎదుట జనజీవన స్రవంతిలోకి
కేంద్రం ప్రకటించిన ఆపరేషన్ కగార్ సత్పలితాలను ఇస్తోంది. త్వరలో మావోయిస్టు రహిత భారత్ ప్రకటిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే చెబుతున్నారు . దీంతో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఇప్పటికే సంబాల వంటి అగ్రనేతలు ఎన్ కౌంటర్ లో చనిపోయారు. అగ్రనేతలు ఎక్కువ సంఖ్యలో చనిపోవడంతో పార్టీ కేడర్ ఆత్మస్తైర్యం కోల్పోయింది ఆయుధాలు త్యజించి పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నమౌతున్నారు.
తాజాగా ములుగు జిల్లాలో ఏడుగురు మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ డాక్టర్ శబరీష్ సమక్షంలో శనివారం నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన వారు లొంగిపోయిన వారిలో ఉన్నారు. ‘‘పోరు కన్నా ఊరు మిన్న - మన ఊరికి తిరిగి రండి’’ పేరిట భద్రతాబలగాలు కౌన్సిలింగ్ ఇస్తున్నాయి. జిల్లా పోలీసులతో బాటు సీఆర్పిఎఫ్ బెటాలియన్ బలగాలు ప్రజలు, మావోయిస్టులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు డిపార్ట్ మెంట్ కల్పిస్తున్న పునరావాస సదుపాయాల గూర్చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి . నిషేధిత మావోయిస్టు పార్టీలో వివిధ హోదాలలో పనిచేస్తోన్న నలుగురు మహిళలు సహా ఏడుగురు సభ్యులు ఎస్పీ ఎదుట లొంగిపోయారు. వీరిలో ఏరియా కమిటీ సభ్యుడు తాటి ఉంగి, ముగ్గురు పార్టీ సభ్యులు కొడ్మే సుక్కు, పోడి భీమ్, కుంజం వరలక్ష్మి, పద్మం మరో ఇద్దరు ఉన్నారు.