కెఏ పాల్ పై లైంగిక కేసు
x

కెఏ పాల్ పై లైంగిక కేసు

నైట్ షిప్ట్ ఉద్యోగితో అసభ్య ప్రవర్తన


ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఫిర్యాదుమేరకు కెఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసునమోదైంది. కెఏ పాల్ కంపెనీలో ఓ యువతి నైట్ షిప్ట్ పని చేసినట్లు పోలీసులు తెలిపారు. నైట్ షిప్ట్ లో పని చేసే సమయంలో కెఏ పాల్ వచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తొలుత షీటీమ్స్ ను సంప్రదించింది. అక్కడ కెఏ పాల్ యువతి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ను షీటీమ్స్ సేకరించింది. అనంతరం బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. కెఎ పాల్ తనను లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాధిత యువతి పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.తనతో అసభ్య రీతిలో ముట్టుకున్నట్టు యువతి ఫిర్యాదు చేసింది.

Read More
Next Story