జువైనల్ హోం బాలుడిపై లైంగికదాడి
x

జువైనల్ హోం బాలుడిపై లైంగికదాడి

సైదాబాద్ జువైనల్ హోం సంరక్షకుడి అఘాయిత్యం


బాల నేరస్థులకు శిక్షలు పడ్డ తర్వాత జువైనల్ హోం (Juvenile home)కు తరలిస్తారు. మరి అలాంటి జువైనల్ హోంలో బాలలకు రక్షణ (safety) లేకుండా పోయింది. సైదాబాద్ జువైనల్ హోం సంరక్షకుడు రహమాన్ గత కొంతకాలంగా ఆరుగురు బాలురపై అసహజ లైంగిక వాంఛతీర్చుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రహమాన్ వికృత చేష్టలకు భయపడి దసరా సెలవుల అనంతరం జువైనల్ హోంలో శిక్ష అనుభవిస్తున్న ఓ బాలుడు తిరిగి వెళ్లడానికి భయపడుతున్నాడు. జువైనల్ హోంకు వెళ్లనని ఆ బాలుడు భీష్మించుకుని కూర్చున్నాడు. తల్లి గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే అసలు విషయం బయట పడింది. బాలుడిపై ప్రతీరోజు సంరక్షకుడే అసహజ పద్దతిలో లైంగిక వాంఛ తీర్చుకునే వాడు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రహమాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు రహమాన్ ను విచారణ చేస్తే మొత్తం ఆరుగురు బాలురిపై లైంగిక దాడి జరిగినట్లు వెల్లడైంది. బాధిత బాలుడికి వైద్య పరీక్షలు చేస్తే లైంగిక దాడి జరిగినట్లు రుజువైంది. మరో ఐదుగురు బాలురకి వైద్య పరీక్షలు చేస్తున్నారు.

Read More
Next Story