
కూతురు అంటూనే లైంగిక వేధింపులు
సాప్ట్ వేర్ ఉద్యోగిపై జూబ్లిహిల్స్ పోలీసులు కేసు
సాప్ట్ వేర్ సంస్థలో హెచ్ ఆర్ భాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగి(26) పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సహోద్యోగి మృణాల్ సేన్ (55)పై హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మైండ్ స్పేస్ లోని ఓ సాప్ట్ వేర్ సంస్థలో పని చేస్తున్న యువతితో అదే సంస్థలో పని చేస్తున్న పై అధికారి పరిచయం పెంచుకున్నాడు. తన కూతురు మాదిరిగా ఉన్నావంటూ యువతికి దగ్గరయ్యాడు. గత జులై నెల 5వ తేదీన జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 72లో ఉన్న స్విప్ట్ ఎలిమెంట్ స్పాకు ఇద్దరూ కల్సి వెళ్లారు. తనకు ప్రత్యేకంగా కే టాయించిన గదిలో యువతి మసాజ్ చేసుకుంటున్న సమయంలో మృణాల్ సేన్ అక్కడ ఎంట్రీ ఇచ్చాడు. తన అనుమతి లేకుండా గదిలోకి వచ్చిన మృణాల్ సేన్ తో యువతి ఘర్షణ పడింది. అయినా మృణాల్ సేస్ బయటకు వెళ్లకుండా యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. యువతి అరుపులకు భయపడ్డ మృణాల్ సేన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇటీవలె లండన్ వెళ్లిన మృణాల్ సేన్ యువతికి వీడియో కాల్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. రోజుకు అనేక పర్యాయాలు వీడియోకాల్స్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని యువతి హెచ్ ఆర్ టీం కు తెలియజేసింది. తర్వాత జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృణాల్ సేన్ పై బిఎన్ ఎస్ సెక్షన్ 75(1)(ఐ) (2), 79 సెక్షన్ ల క్రింద కేసు నమోదైంది.