రాసలీలలకు అడ్డొస్తుందని కూతురునే కడతేర్చింది
x

రాసలీలలకు అడ్డొస్తుందని కూతురునే కడతేర్చింది

ప్రియుడితో నరసరావుపేటలో మకాం


రాసలీలలకు కూతురు అడ్డుగా ఉందని ప్రియుడితో కల్సి హత్య చేసింది ఓ కన్నతల్లి. సభ్య సమాజం సిగ్గుపడే ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు ఒక్కోటి బయటకు వచ్చాయి.

ఐదేళ్ల క్రితం మమతకు సిద్దిపేట రాయపోల్ గ్రామానికి చెందిన భాస్కర్ తో పెద్దల సమక్షంలో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. పెళ్లయినప్పటి నుంచి మమత తరచూ భర్తతో తగువు పడేది. ఈ ఏడాది మార్చిలో భర్తతో తగువు పడి శివ్వంపేట శభాష్ పల్లిలోని పుట్టింటికి చేరుకుంది. తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వచ్చిన మమత అదే గ్రామానికి చెందిన ఫయాజ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ నోటా ఈ నోటా విషయం బయటకు పొక్కింది. ప్రియుడితో వెళ్లిపోదామని డిసైడ్ అయిన మమత భర్త భాస్కర్ పురుగుల మందు తాగినట్టు చెప్పి పుట్టింటి నుంచి కూడా వెళ్లిపోయింది. మమత ప్రియుడి మోజులో పడి ఐదేళ్ల కొడుకును అక్కడే వదిలేసి రెండేళ్ల కూతురు తను శ్రీ తో వెళ్లిపోయింది. కొడుకును వదిలేసి కూతురును మాత్రమే తీసుకెళ్లడంతో తల్లిదండ్రులకు అనుమానాలు వచ్చాయి. తల్లిదండ్రులు అల్లుడు భాస్కర్ కు ఫోన్ చేశారు. భాస్కర్ క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్న తల్లిదండ్రులకు మమత ఫయాజ్ తో వేరు కాపురం పెట్టినట్టు అనుమానించారు. కూతురు , మనవరాలు కనిపించడం లేదని శివ్వంపేట పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

గుంటూరులో మమత ఫోన్ సిగ్నల్స్

కేసు నమోదు చేసుకున్న పోలీసులకు మమత ఫోన్ ట్రాప్ చేశారు. సిగ్నల్స్ ఆధారంగా మమత గుంటూరు లో ఉన్నట్టు బయటపడింది. పోలీసులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చేరుకున్న పోలీసులకు మమత ప్రియుడు ఫయీజ్ తో ఉన్నట్టు గుర్తించారు. కూతురు కోసం పోలీసులు ఆరాతీస్తే మమత పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. పోలీసులు తమదైన స్టైల్ లో దర్యాప్తు చేస్తే కూతురును ఈ సంవత్సరం జూన్ ఏడోతేదీన హత్య చేసినట్టు ఒప్పుకుంది. పుట్టినిల్లు అయిన శభాష్ పల్లి గ్రామ శివారులో కూతురును హత్య చేసి అక్కడే పూడ్చిపెట్టినట్టు అంగీకరించింది

పూడ్చిపెట్టేందుకు ప్రియుడు ఫయాజ్ సహకరించినట్టు మమత పోలీసులకు చెప్పింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పూడిక తీస్తే తనుశ్రీ కుళ్లిన స్థితిలో కనిపించింది. కూతురును హత్య చేసిన తర్వాతే మమత గుంటూరుకు మకాం మార్చింది. మమత, ఫయాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read More
Next Story