తెలంగాణలో శ్రీశైలం వెళ్లే దారిలో అమ్రాబాద్ మండలంలో కొల్లంపెంట దగ్గర అడవిలో ఒక అరుదైన శివలింగం కనిపించింది. ఇదెందుకు అరుదైనదంటే, ఈ శివలింగంపై ఒక శాసనం చెక్కారు. అది కూడా ఫార్సీ భాషలో ఉంది. ఇది నిజాం కాలపు శాసనమని తెలిసింది.
ఇంతకు మునుపు ఎక్కడా శివలింగంపై శాసనం లభించిన దాఖలా లేదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
శాసన సారాంశం:
హైదరాబాద్ రాజ్య నవాబు (8వ) నిజాముల్ ముల్క్ ఆసఫ్ జా, ముకరం ఉద్ దౌలా బహదూర్ కొలువులోని జైన్ చంద్ర అనే సుంకం అధికారి 1350 హిజ్రి 3వ జిల్హిజి అంటే 1932 పేప్రిల్ 9వ తేదీన అక్కడి బంజరులో మొక్కలు నాటించారు.
ఈ విషయాన్ని లింగంపై శాసన రూపంలో నమోదు చేశారు. అదే లింగంపై తెలుగులో కూడా చెక్కిన శాసనపంక్తులు కనిపిస్తున్నాయని ఆ ఫోటో సమకూరలేదని హరగోపాల్ చె్పారు.
ఈ శాసనాన్ని పార్శీ నిపుణుడు అబ్బాస్ అలీ తెలుగులోకి తర్జు మా చేశారు.
శాసనం పంక్తులు:
1. నవ్వాత్ ముకరముద్దౌలా బహదూర్
2. దారుల్ ముహా మాల్గుజారీ సర్కారే ఆలీ (యానే ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ నిజాం సర్కార్)
3. చన్ చంద్రకీ బతారిక్ సుయ్యూమ్ తీన్ జిల్హిజ్జా బారా సౌ పచాస్ హిజ్రీ
4. అజ్దారీగే వతరాకుమ్ హజ్జారీ యక్షప్ నిమాయింద్(యానే లోగోంనే దేఖా వో ప్రాపర్టీ కో వోలోగ్ బతౌరే గవాఁ థే
5. వాహీస్సహరా రాహిస్తాఁ కా మౌసమ్ కా దిందక్(వో జగల్ రేతీలా జంగల్ జో ఉన్కే నామ్ కియాగయాథా మౌసమ్ కా దిందక్ మౌసమ్ కా.....యానే ఉన్హే దియాగయా లోగ్ గవా థే)
6. మహమ్మద్ ఇస్మాయిల్ షమ్ సియ్యూమ్ తాలూఖ్ దార్ కంధా(...మహమ్మద్ ఇస్మాయిల్ జో హై వో తీస్రే తాలూఖ్దార్ హై జో యే లిఖ్నేమే బతౌరే గవాథే ఉన్హోనే లిఖా వో కేర్ టేకర్ హై...మహమ్మద్ ఇస్మాయిల్ షర్మ్ ఇస్ దస్తావేజ్ కో లిఖ్నేమే..
ఇలా శివలింగం మీద ఒక శాసన చెక్కడం కొంత వరకు అభ్యంతరకమని హరగోపాల్ వ్యాఖ్యానించారు. ఎందుకు శాసనం కోసం శివలింగాన్ని ఎంచుకుని ఉండవచ్చు?
‘‘ ఈ ప్రాంతంలోని బంజరు భూమిలో ఒక వ్యక్తి మొక్కలు నాటుతున్నారు. ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలనుకున్నారు. ఈ ప్రాంత ప్రజలు పూజిస్తున్న శివలింగం మీద ఈ సమాచారం చెక్కితే నలుగురికి తెలుస్తుందని నిజం పాలకులు భావించి ఉండవచ్చు. అంతేకాదు, ఈ శాసనాన్ని ఎవరుచెరిపేసేందుకు కూడా అస్కారం ఉండదు. వాళ్లెలా భావించినా, శాసన చెక్కేందుకు
శివలింగాన్ని ఎంచుకోవడం సరైంది కాదు,ష" ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ కొత్త చరిత్ర బృందం అనేది తెలంగాణ ఉద్యమ కాలంలో ఏర్పాటుయిన చరిత్రకారుల, పురావస్తు నిపుణుల, ఔత్సాహిక చరిత్రకారుల బృందం. అన్ని జిల్లాలలో వ్యాపించిన ఉన్న ఈ బృందం సభ్యులు తెలంగాణ చారిత్రక అధారాలు వెదికే పనిలో నిమగ్నమయిన ఉన్నారు.ఈ బృందం సభ్యుల కృషి వల్ల తెలంగాణ ప్రాచీన చరిత్ర, రాతియుగాల నాటి అవశేషాలెన్నో బయటపడుతున్నాయి. ఈ శివలింగం కూడా ఇలాగే బయటపడింది.
శాసనం చదివి సహకరించిన చరిత్రబృందం అబ్బాస్ అలీ, అబ్దుల్ వాహెద్, అబ్దుల్ బాసిత్, కందుల వేంకటేశ్, దాసరి మల్లికార్జున్, సతీశ్ గాందీకి హరగోపాల్ ధన్యవాదాలు తెలిపారు.
ఫోటోకర్టెసీ: గాజుల బసవరాజు, నర్సింహులు(యాలాల)