హైద్రాబాద్ ఎస్ ఆర్ నగర్ లో అగ్ని ప్రమాదం
x

హైద్రాబాద్ ఎస్ ఆర్ నగర్ లో అగ్ని ప్రమాదం

షార్ట్ సర్క్యూటే కారణమా ?


హైద్రాబాద్ ఎస్ ఆర్ నగర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. క్రిష్ హోటల్ లోని కాఫీడేలో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలనార్పుతున్నారు.

షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని అధికారులు చెప్పారు.

హైద్రాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను కలవరపెడుతోంది. యాజమాన్యాల నిర్లక్యం కారణంగా ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేయడం తప్ప శాశ్వత పరిష్కారాలను అటు ప్రభుత్వాలు, ఇటు యాజమాన్యాలు చూపించలేకపోతున్నాయి.

Read More
Next Story