ఎవరినీ కదిలించినా  కన్నీటి వరదే...
x

ఎవరినీ కదిలించినా కన్నీటి వరదే...

ఎపుడు దుర్వార్త వినవలసి వస్తుందోనని సర్వత్రా భయం


పాశమైలారం సిగాచి రసాయనాల కంపెనీ లో జరిగిన పేలుడులో కడప జిల్లాలకు చెందిన ఒక జంట నిఖిల్ రెడ్డి , రమ్యలు గల్లంతయిన వారిలో ఉన్నారు. వాళ్లకీ మధ్యనే వివాహమయిందని సమాచారం.వీరిద్దరు జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికల పాడు గ్రామానికి చెందిన వారు.నిఖిల్ రెడ్డి వయసు ౩౩ సంవత్సరాలు. ఈ మధ్య నే ఉద్యోగంలో చేరినట్లు ఆయన సోదరుడు నిషాంత్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’ కు తెలిపాడు. ఆయన మృతదేహం కోసం పఠాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో వేచిచూస్తున్నాడు. అక్కడున్న మృతదేహాలేవీ గుర్తించేస్థితిలో లేవని ఆయన తెలిపారు. గుర్తించే అవకాశం డాక్టర్లు కల్పిస్తారనిఆశగా ఎదురుచూస్తున్నాడు. దీనికి ఎన్ డిఎ పరీక్ష లు జరపాల్సి వుంది.



ఇలా నిషాంత్ రెడ్డిలాగా ఎన్నో కుటుంబాలు చినపోయిన తమ వారిని గుర్తించేందుకు ఎదురుచూస్తున్నాయి, రోధిస్తున్నాయి ప్రమాదంలో 43 మంది ఆచూకి తెలియడంలేదు. దీనితో ఆయా కుటుంబాల వాళ్లు రోదిస్తున్నారు. వాళ్లు ఏమయ్యారో ఏవైపునుంచి సమాచారం లేదు.

అంతటా విషాదం

ఆసుపత్రుల దగ్గిర, కాలిపోయిన కంపెనీ దగ్గిర కుటుంబ సభ్యుల రోదనలు హృదయాలను కదలిస్తున్నాయి. గల్లంతయిన వారు చనిపోయారా, కూలిపోయిన భవనాలకింద సజీవంగా ఉన్నారా తెలియడంలేదు. చాలా మంది శరీరాలు కాలి బూడిదయిపోయాయి. ప్రమాదంలో సుమారు 700 నుంచి 800 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఏర్పడిందని దీనితో చాలా మంది కాలి మసి అయిపోయారు. వీళ్లని గుర్తించాలంటే కుటుంబ సభ్యులతో ఎన్ డిఎ పరీక్ష జరపాలి. ఈ పరీక్ష ఫలితాలు రావాలంటే కనీసం 24 గంటల నుంచి 48 గంటలు పెడుతుంది. 35 మృతదేహాలు ఇక్కడి పఠాన్ చెరు ప్రభుత్వాసుపత్రి మార్చురీ లో ఉన్నాయి.

వీటిలో చాలా మంది మృత దేహాలు గుర్తించలేనంతగా మాడిపోయి ఉన్నాయి, డ్యూటీలో ఉన్నవారి లిస్టు ప్రకారం ప్రమాదం విషయాన్ని కుటుంబ సభ్యలుకు అందించారు. మృతుల్లో ఎక్కువ మంది ఉత్తర ప్రదేశ్, ఒడిశా ల వారని, తెలుగు వారు తక్కువ అని చెబుతున్నారు. చాలమంది భర్తలను కోల్పోయారు, కొందరు తండ్రలను, కొడుకులను కోల్పోయారు. ఈ ప్రాంతమంతా విషాద వాతావరణ అలుముకుంది. ఎపుడు ఎవరి నుంచి విషాద వార్త వినవలసి వస్తుందో నన్నభయం ఆందోళన సర్వత్రా కనిపిస్తుంది.

మార్చారిలో మన వాళ్లు లేకుంటే బాగుంటుందనే ఆశ

పేలుడు జరిగి సిగాచి కెమికల్స్ ప్లాంట్ శిథిలమైంది. అక్కడి నుంచి యాజమాన్యం మాయమయింది. నిన్న ఒక్క రోజు పరిశ్రమను చూసుకుని ఛైర్మన్ , వైస్ చైర్మన్లు వెళ్లిపోయారు. ఇక్కడ ఉండి బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు కంపెనీ మనుషులెవరూ లేరు. అన్ని ఏర్పాట్లు చేశారు. చికిత్స కయ్యే ఖర్చును కంపెనీ యే భరిస్తుందని డాక్టర్లకు చెప్పామని కంపెనీ సీనియర్ ఉద్యోగి ఒకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖంచాటేసిన యాజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం చేసినపుడు మెల్లగా చెప్పాడు.

బ్లాస్టులో పెట్టిన వేడికి మూడంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. దీని శీధిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గాలి మందంగా ఉంది. మండుతున్న ప్లాస్టిక్, పారిశ్రామిక రసాయనాలవాసన గొడుతూ ఉంది ఆ ప్రాంతమంతా. ఇక్కడ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ పౌడర్ తయారవుతుంది. కళ్ళు గొంతును మండించే పొగ దానికి దుర్వాసనతో. దాదాపు 40 సంవత్సరాల కిందట ఈ ప్లాంట్ ను గుజరాత్ కు చెందిన వారు నెలకొల్పారు. ముఖ్యమంత్రి చెబుతున్న దాని ప్రకారం ప్రమాదం జరిగి సూచన సమాచారాన్ని అధికారులు ఫ్యాక్టరీకి తెలిసారు. ఈ డాక్యుమెంట్ ను అందుకుని సంతకం చేసినట్లు ముఖమంత్రి రేవంత్ ఎదరుగానే కంపెనీ ప్రతినిధి ఒకరు ఒపుకున్నారు. అయినా ప్రమాదం జరిగింది. దీనిని బట్టి నిర్లక్యం లోతు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. శిథిలాల మీదుగా నడవాలన్నా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నడిస్తు, వత్తిడికి శిథిలాలు సజీవంగా ఎవరైనా ఉంటే ... వాళ్లకేమయిన జరుగుతుందేమోనని అనుమానం అని అక్కడ పని చేస్తున్న రెస్క్యూ వర్కర్ తెలిపారు.

ప్రమాదం ఎలా జరిగిందో ఎవరికీ తీలియదు. లేక తెలిసినా చెప్పడం లేదో. అలాగే తమ వాళ్లేమయ్యారో తెలియదు, చినిపోయారు, వేడికి మాడిమసైపోయారో తెలియదు, శిథిలాల కింద నలితిపోయారో తెలియదు,శిథిలాల కింద సజీవంగ ఉన్నారేమో అన్న ఆశ చాలా మందిలో ఉంది. అంతేకాదు పఠాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాల్లో తమ వాళ్లది లేకుంటే బాగుండనే అశ చాలా మంది ఉంది. అదే ఆశతోనే నిశాంత్ రెడ్డి తన తమ్ముడి, మరదలు సమాచారం కోసంఎదురుచూస్తున్నాడు హైదరాబాద్ ఫార్మాచరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం ఎపుడూ జరగలేదు.

ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సిగాచి కార్మికులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి


ఈ వార్త రాస్తున్నప్పటికి మృతుల సంఖ్య 42కు చేరింది. ఘటనాస్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆసుప్రతులలో మరికొందరు క్రిటికల్ ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్‌లో, హైడ్రా, సింగరేణి టీమ్‌, డిజాస్టర్ మేనేజ్ మెంట్ , ఫైర్ విభాగం పాల్గొంటున్నాయి. ప్రమాద సమయంలో 143 మంది స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మకులు పనిచేస్తున్నట్లు గుర్తించారు. 34 మందికి తీవ్రగాయాలు అవగా వారిని వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 29 మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆరు మృతదేహాల గుర్తించారు. ఇంకా 17 మంది ఆచూకీ గల్లంతు అయ్యినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి 57 మంది సురక్షితంగా బయటపడ్డారు.



Read More
Next Story