సిగాచి ఘటనలో మరొకరు మృతి
x

సిగాచి ఘటనలో మరొకరు మృతి

39 కి చేరిన మృతుల సంఖ్య


పాశమైలారం ఘటనలో రోజుకో దుర్వార్త వినాల్సి వస్తోంది. సోమవారం పాశమైలారం పారిశ్రామిక వాడ సిగాచీలో బ్లాస్ట్ జరిగినప్పటి నుంచి రోజుకో దుర్వార్త వినాల్సి వస్తోంది. అధికారికంగా ముప్పయ్ ఎనిమిది మంది చనిపోయినట్టు తేలితే అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే విస్పోటనం జరిగినప్పుడు వంద మీటర్ల ఎత్తులో కార్మికులు పడిపోయారు. సిగాచి మూడంతుస్థుల భవనం కూలిపోయింది. కూలిన ప్రదేశంలో శిథిలాల క్రింద ఎంతమంది చిక్కుక్కున్నారోఇంకా లెక్క తేలలేదు. మరికొందరు చనిపోయిన వారి లిస్టులో లేరు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో లేకపోవడంతో బాధితుల ఆర్తనాదాలు సిగాచిలో మిన్నంటాయి.శుక్రవారం మరో కార్మికుడు మృతి చెందాడు. సిగాచి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సోమవారం నుంచి ధృవ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భీం రావు మరణించాడు. భీం రావ్ మహరాష్ట్ర వాస్తవ్యుడు. పోస్ట్ మార్టం తర్వాత భీం రావు మృత దేహాన్ని స్వస్థలానికి తరలించనున్నారు. ప్రమాద స్థలిలో ఆరో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

కీలక ప్రకటన

సిగాచి బ్లాస్ట్ ఘటనపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 39కి చేరింది. 32 మృత దేహాలను గుర్తించినట్టు చెప్పారు. మరో 7 మృత దేహాలను గుర్తించలేకపోయామన్నారు. ఆస్పత్రి నుంచి 12 మంది సురక్షితంగా బయటపడ్డారని, మరో 23 మంది చికిత్స పొందుతున్నారని అన్నారు. 9 మంది ఆచూకీ దొరకడం లేదు అని ప్రావీణ్య చెప్పారు.

ఇదిలా వుండగా సిగాచీ బాధితులు ఆరో రోజు కూడా ఆందోళన కొనసాగించారు. ఆరు రోజులైనా తమ వారి జాడ లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Read More
Next Story