ఎంఎల్ఏతో పెట్టుకుంటే ఇట్లే ఉంటుంది
x
MLA Adi Srinivas and Sanjay Kumar jha

ఎంఎల్ఏతో పెట్టుకుంటే ఇట్లే ఉంటుంది

ఎంఎల్ఏకి కోపంరావటంతో ఒక కలెక్టర్ కు అకస్మాత్తుగా బదిలీ వచ్చేసింది.


ప్రజాస్వామ్యంలో ఓటర్లే ప్రభువులు అని అంటారు కాని నిజానికి పదవుల్లో ఉన్నవారే ప్రభువులు. అన్నీ వ్యవస్ధల్లోకి రాజకీయ వ్యవస్ధదే ఆధిపత్యం. రాజకీయనేతలు చెప్పినట్లే మిగిలిన వ్యవస్ధలు నడుచుకోవాలి. అందులోను ప్రజాప్రతినిధులు చెప్పిందే వేదం. ఎందుకంటే చట్టసభల్లో చట్టాలు చేసేది, వాటిని అమలును పర్యవేక్షించేది కూడా ప్రజాప్రతినిధులే. ఇప్పుడిదంతా ఎందుకంటే ఎంఎల్ఏకి కోపంరావటంతో ఒకకలెక్టర్ కు అకస్మాత్తుగా బదిలీ వచ్చేసింది.

ఇంతకీ ఏమిజరిగిందంటే సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ ఝాపై ప్రభుత్వం బదిలీ వేటువేసింది. ఎందుకంటే ఈనెల 17వ తేదీన సిరిసిల్లలో ప్రజా పాలనా దినోత్సవం జరిగింది. ఆసందర్భంగా వేములవాడ ఎంఎల్ఏ, అసెంబ్లీ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. అదేకార్యక్రమానికి హాజరవ్వాల్సిన కలెక్టర్ సంజయ్ ఆలస్యంగా వచ్చారు. దీనిపై ఎంఎల్ఏ ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదుచేశారు. ఫిర్యాదు ఆధారంగా చీఫ్ సెక్రటరీ కలెక్టర్ కు షోకాజ్ నోటీసు జారీచేసి సమాధానం చెప్పేందుకు మూడురోజులు గడువిచ్చారు.

షోకాజ్ నోటీసులో ఏమడిగారో ? అందుకు కలెక్టర్ ఏమని సమాధానం ఇచ్చారో తెలీదు. సడెన్ గా శనివారం సంజయ్ కు కలెక్టర్ పోస్టునుండి బదిలీచేసేసింది ప్రభుత్వం. రవాణా, రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీచేసింది. ఎంఎల్ఏ ఫిర్యాదుకారణంగా కలెక్టర్ పైన ప్రభుత్వం డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జిల్లాకి కలెక్టర్ ఫస్ట్ పర్సనే అయినా, జిల్లా మొత్తానికి కలెక్టరే హెడ్ అయినా ఎంఎల్ఏకి కోపం వస్తే ఏమి జరగుతుందనేందుకు ప్రజా పాలనా దినోత్సవంలో జరిగిన సంఘటనే ఉదాహరణ.

నిజానికి ప్రజాప్రాతినిధ్యంచట్టంలోని ప్రోటోకాల్ ప్రకారం ఎంఎల్ఏలను రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ప్రజా పాలనా దినోత్సవం వేడుకలకు కలెక్టర్ ముందుగా హాజరై ముఖ్య అతిధిగా హాజరైన ఎంఎల్ఏ ఆదిశ్రీనివాస్ ను రిసీవ్ చేసుకోవాలి. ఈవిషయం కలెక్టర్ కు తెలీకుండా ఉండదు. అయితే ఏకారణంగా కలెక్టర్ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చారో తెలీదు. కారణం ఏదైనా సరే, తనను రిసీవ్ చేసుకోవాల్సిన కలెక్టర్ అక్కడ లేకపోవటంతో ఎంఎల్ఏకి మండింది. ఆ కోపంతోనే ఫిర్యాదుచేయటం, డిసిప్లిన్ యాక్షన్ గా కలెక్టర్ కు బదిలీ అయిపోవటం వెంటనే జరిగిపోయింది.

Read More
Next Story