
Phone Tapping Case: సీఎం తమ్ముడికి నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ తమ్ముడితో పాటు బీఆర్ఎస్ నేతలు ఇద్దరికి నోటీసులు జారీ.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో కీలక మలుపు తీసుకుంది. ఇందులో విచారణకు హాజరుకావాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. అదే విధంగా బీఆర్ఎస్ నేతలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యకు కూడా నోటీసులు జారీ చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన తప్పుడు కొండల్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆయనను విచారణకు హజరుకావాలని కోరింది. గురువారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరుకాాలని తెలిపింది.
ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలను కూడా గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ సిట్ తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్‌రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు నోటీసులు ఇచ్చింది. కాగా ఈ విచారణకు కొండలరావు, సందీప్ రావు హాజరుకాలేదు. అనారోగ్యం వల్ల సిట్ కార్యాలయానికి రాలేకపోతున్నట్లు కొండల్‌రావు సిట్‌కు వివరించారు. విచారణకు తాను తన నివాసంలో సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపినట్లు సమాచారం.

