సిట్ ముందు హాజరైన ప్రభాకర్ రావు.. ప్రశ్నలు సంధించిన అధికారులు
x

సిట్ ముందు హాజరైన ప్రభాకర్ రావు.. ప్రశ్నలు సంధించిన అధికారులు

ప్రభాకర్ రావు విచారణలో ఎంతమంది పెద్దల, ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయనేది ఆసక్తికర అంశంగా మారింది.


ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ఏస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అతని విచారణ జరుగుతోంది. ఏసీపీ వెంకటగిరి ఈ విచారణను జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీసు అధికారులు.. ఎస్‌ఐబీ చీఫ్ ఆదేశాల మేరకే ముందుకు వెళ్లామని, ఉద్దేశపూర్వకంగా చేయలేదని స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫోన్‌ ట్యాపింగ్ కేసులో జర్నలిస్టులు, రాజకీయ నేతలు, జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. ఆ అంశాలపై ప్రభాకర్‌ రావును సుదీర్ఘంగా విచారించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

మాస్టర్‌మైండ్‌ ఎవరనేదే కీలకం..!

అయితే అసలు ఫోన్ ట్యాపింగ్‌కు ఎవరు ఆదేశించారు? ఎవరి ప్లాన్ ప్రకారం ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు? దీని వెనక ఎవరు ఉన్నారు? వంటి అనేక కోణాల్లో దర్యాప్తును అధికారులు ముందుకు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావు విచారణలో ఎంతమంది పెద్దల, ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయనేది ఆసక్తికర అంశంగా మారింది. దానికి తోడుగా ఎంత మంది ప్రముఖుల ఫోన్‌లు ట్యాపింగ్‌కు గురయ్యాయి? అన్న విషయంపై కూడా ఒక క్లారిటీ తెచ్చుకోవడం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇన్నాళ్లూ అందుబాటులో లేకుండా పోయిన ప్రభాకర్ రావు విచారణలో వీలైనన్న అంశాలు తెలుసుకునేలా దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రభాకర్ రావు పై ఇప్పటి వరకు సంధించిన ప్రశ్నలు

1. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు చెప్పాలనుకుంటున్నారు ?

2. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయిన వెంటనే మీరు విదేశాలకు ఎందుకు వెళ్లిపోయారు ?

3. కేసు నమోదు అయిందనే సమాచారం తోనే విదేశాలకు పారీపోయారా ?

4. మీరు రాజీనామా చేసిన రోజు హార్డ్ డిస్క్ లను ధ్వసం చేశారు ?

5. ప్రణీత్ రావు మీ ఆదేశాలతోనే హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేసినట్లు చెప్పాడు ? మా దగ్గర స్టేట్మెంట్ ఉంది మీరేమంటారు ?

6. స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీమ్ ను ఎవరు చెపితే ఏర్పాటు చేశారు ?

7. ఈ టీమ్ ఏర్పాటు గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఏర్పాటు చేశారా ?

8. నాలుగు వేల కు పైగా ఫోన్ లు ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.. ఈ నెంబర్లు ఎవరు ఇచ్చారు ?

9. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసులు అధికారులందరూ మీ పేరే చెప్తున్నారు ?

10. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేశారు.. ఇందులో కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది కదా ?

11. సాధారణ ఎన్నికల్లో BRS పార్టీ అధికారంలోకి రాకపోతే హార్డ్ డిస్క్ లను , ఇతర ఆధారాలను ధ్వసం చేయాలని ముందే ప్లాన్ చేశారా ?

12. ప్లాన్ ప్రకారమే ఎన్నికల ఫలితాల రోజు రిజైన్ చేసి , ఆధారాలను మాయం చేశారా ?

13. . శ్రవణ్ రావు ప్రయివేటు వ్యక్తి.. అతనితో SIB కి ఏంటి సంబంధం ?

14. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ లను సైతం ఎందుకు ట్యాప్ చేశారు.. మీకు ఎవరైనా పెద్దలు ఆదేశాలు ఇచ్చారా ?

15. ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికలు సమయంలో కేవలం విపక్ష పార్టీల నాయకులు ఫోన్లు ట్యాప్ చేసే టాస్క్ ఫోర్స్ పోలీసులతో డబ్బులు సీజ్ చేశారా?


మరికొన్ని కోణాల్లో కూడా అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. మూడు రోజుల పాటు ప్రభాకర్ రావు విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More
Next Story