
నూతన డిజిపిగా శివధర్ రెడ్డి
1994 బ్యాచ్ ఐపిఎస్ అధికారి
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గా బి.శివధర్ రెడ్డి గారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక ఉత్తర్వులను అందచేశారు.
నూతన డీజీపీగా నియమితులైన సందర్భంగా ముఖ్యమంత్రి శివధర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. శివధర్ రెడ్డి ఇండియన్ పోలీస్ సర్వీస్ 1994బ్యాచ్ కు చెందిన అధికారి. ప్రస్తుతం తెలంగాణ ఇంటలిజెన్స్ ఛీఫ్ గా శివధర్ రెడ్డి పనిచేస్తున్నారు. అక్టోబర్ 1 ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.
శివధర్ రెడ్డి నేపథ్యం
హైదరాబాద్ లో జన్మించిన శివధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామానికి చెందినవాడు. ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లో చదువుకున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా practise చేసి తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994 లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌కి ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ASP గా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా పనిచేశారు. గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్ గా, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు. SP గా, DIG SIB గా మావోయిస్టుల అణిచివేతలో కీలక పాత్ర పోషించారు. 2014-2016 మధ్యన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమితులయ్యారు. 2016 నయీం ఎన్కౌంటర్లో ఆపరేషన్ ను plan చేసిన శివధర్ రెడ్డే అని చెబుతారు.
ఆయన కొంతకాలం ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావో లో కూడ పని చేవారు. నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పని చేస్తున్న సమయంలో అనేక సెన్సేషనల్ కేసులను పర్యవేక్షించారు. 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసు కాల్పుల లో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డిసిపి గా నిమమితులయ్యారు.
2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్ అయ్యారు.ఈ ఆగస్టు 2024 లో డీజీపీగా ప్రమోషన్ పొందారు.