టీడీపీ, వైసీపీ మధ్య  సోషల్ మీడియాలో రచ్చ రచ్చ
x
social media war

టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

ఏపీలో ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశంపార్టీకి, ప్రతిపక్షం వైసీపీకి మధ్య సోషల్ మీడియా యుద్ధం తారాస్ధాయికి చేరుకున్నది.


ఏపీలో ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశంపార్టీకి, ప్రతిపక్షం వైసీపీకి మధ్య సోషల్ మీడియా యుద్ధం తారాస్ధాయికి చేరుకున్నది. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నాయకత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బాగా దూకుడుగా వెళుతోంది. ఇపుడు విషయం ఏమిటంటే హైదరాబాద్ లో శనివారం సాయంత్రం ప్రజాభవన్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు సమావేశమ్యారు. విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరపటమే వీళ్ళ భేటీ ముఖ్య అజెండా. ఈ అజెండాలోని కొన్ని అంశాలపైనే ఇపుడు రెండుపార్టీల మధ్య రచ్చ రచ్చ జరుగుతోంది.

నిజానికి శనివారం నాటి ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి అధికారికంగా అజెండా ప్రకటనకాలేదు. అయితే మీటింగ్ అజెండా మొత్తం మీడియాలో వచ్చేసింది. ఎలాగ వచ్చిందంటే ప్రభుత్వమే అనధికారికంగా లీకులిచ్చి రాయించింది. మీడియిలో వచ్చిన అజెండా ప్రకారమే విభజన సమస్యలతో పాటు మరో మూడుఅంశాలు ప్రముఖంగా వచ్చాయి. అవేమిటంటే తిరుమలలో వాటా కావాలని, సుదీర్ఘమైన సముద్ర తీరంతో పాటు కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో కూడా వాటా కావాలని తెలంగాణా ప్రభుత్వం అడగబోతున్నట్లు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. సాయంత్రం మీటింగ్ లో ఎన్ని అంశాలు చర్చకు వచ్చాయి, పైన చెప్పిన మూడు అంశాలు కూడా వచ్చాయా లేదా అన్నది ఎవరికీ తెలీదు.

అయితే ఇదే విషయమై టీడీపీ-వైసీపీ మధ్య సోషల్ మీడియాలో రచ్చ మొదలైపోయింది. తిరుమలలో వాటా కావాలని తెలంగాణా ప్రభుత్వం అడగబోతోందని జగన్ మీడియాలో తప్పుడు వార్త వచ్చిందంటు టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో రచ్చ మొదలుపెట్టింది. ఈ ‘బులుగు మీడియాకు బుద్ధిలేదు..జగన్ రెడ్డికి సిగ్గురాదు’ అంటు చాలా ఘాటుగా ట్విట్టర్లో మొదలుపెట్టింది. ‘తిరుమల ఆంధ్రులకు చెందిన ఆస్తి. తిరుమల ఆస్తులు, ఆదాయంలో పక్కరాష్ట్రం వాటా ఎందుకు అడుగుతుంది’ ? ‘బుర్రలేని బులుగు మీడియా ఇలాంటి ఫేక్ వార్తలు ఆపితే మంచిది’, అని వార్నింగ్ ఇచ్చింది. అలాగే ‘నీ నీచ రాజకీయం కోసం వెంకటేశ్వరస్వామితో మాత్రం పెట్టుకోకు...ఆయన ఆగ్రహిస్తే ఏమవుతుందో చరిత్ర చెబుతుంది’ అని జగన్ కు టీడీపీ వార్నింగ్ ఇచ్చింది.

దీనికి వైసీపీ కూడా అంతే స్ధాయిలో ఘాటుగా రిప్లై ఇచ్చింది. తన ట్విట్టర్లో టీడీపీ దాడికి ఎదురుదాడి మొదలుపెట్టింది. తిరుమలలొ వాటా కావాలని తెలంగాణా ప్రభుత్వం అడగబోతోందని జగన్మోహన్ రెడ్డో లేకపోతే వైసీపీనో చెప్పలేదని ట్విట్లర్లో స్పష్టంచేసింది. ‘శనివారం ఉదయం తెలంగాణాలోని మీడియానే ఈ వార్తను రాసి’నట్లుగా చెప్పింది. తన వాదనకు మద్దతుగా టీడీపీకి మద్దతుగా నిలిచే మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగులను కూడా ట్విట్టర్లో జతచేసింది. ‘ఈ వార్తను బయటకు లీక్ చేసిందే ఈనాడు, ఆంధ్రజ్యోతి’ అంటు ఆ పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులను ట్విట్టర్లో పోస్టుచేసింది. ‘ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా బులుగు మీడియానేనా’ అంటు టీడీపీని వైసీపీ గట్టిగా తగులుకుంది.

నిజానికి ముఖ్యమంత్రుల భేటీ మంచి వాతావరణంలోనే జరిగింది. సమస్యల పరిష్కారానికి చర్చలకు మించిన మార్గంలేదు. విభజన సమస్యల పరిష్కారానికి అవసరమైతే వందసార్లు సమావేశాలు జరిపినా తప్పులేదు. సమస్యల పరిష్కారానికి మూడు అంచెల్లో కమిటీలు వేయాలన్న నిర్ణయం కూడా మంచి నిర్ణయమే. 2 గంటల భేటీపై పాజిటివ్ గా చర్చించకుండా చిన్న విషయాలపై నెగిటివ్ గా టీడీపీ ఎందుకు గోలచేస్తోందో అర్ధంకావటంలేదు. తెలంగాణా ప్రభుత్వం తిరుమలలో వాట అడగబోతోందని సాక్షితో పాటు అన్నీ ప్రధాన పత్రికల్లోను వచ్చింది. సాక్షిలో అంటే జగన్ రాయించారని అనుకోవచ్చు. మరి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా జగనే రాయించారా ? ఇంతచిన్న లాజిక్కును టీడీపీ మరచిపోయి జగన్, వైసీపీకి వార్నింగులివ్వటమే ఆశ్చర్యంగా ఉంది.

Read More
Next Story