భార్య పుట్టింటికి వెళ్లడంతో  సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
x

భార్య పుట్టింటికి వెళ్లడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

విరహవేదన వల్లే..


ఆశాడమాసం కావడంతో పెళ్లయిన నవ వధువు పుట్టింటికి వెళ్లడంతో విరహవేదనతో హైద్రాబాద్ లో సాప్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఏఫ్రిల్ మాసంలో కూకట్ పల్లి కెపిహెచ్ బి కాలనీకి చెందిన 35 ఏళ్ల చైతన్యకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మౌనికతో వివాహమైంది. ఆశాడ మాసం కావడంతో తాళ్ల పూడి మండలం తిరుగుడె మెట్ట గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. పెళ్లయినప్పటి నుంచి భార్య పుట్టింటికి వెళ్లలేదు ఆషాడ మాసం కావడంతో పుట్టింటి వాళ్లు మౌనినకు తీసుకెళ్లారు. ఆషాడమాసంలో నవ వధువు ముఖాన్ని అత్తింటి వారు చూడకూడదన్న ఆచారం ఉంది. భర్త చైతన్య పుట్టింటికి వెళ్లకూడదని ఒత్తిడి తెచ్చాడు. అయినా భార్య వినకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. దిగులుగా ఉన్న చైతన్య భార్యతో రోజూ గంటల తరబడి మాట్లాడేవాడు. నిన్న రాత్రి కూడా భార్యతో మాట్లాడిండు. మాట్లాడుతుండగానే ఫోన్ కట్ అయింది. మౌనిక తన మామ(భర్త తండ్రి) కి సమాచారమిచ్చింది. వెంటనే క్రింది అంతస్థులో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్లి చూడగా చైతన్య అప్పటికే చనిపోయాడు. విగత జీవిగా కొడుకు పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు జీ ర్ణించుకోలేకపోతున్నారు. చైతన్య తన గదిలోనే ఉరి వేసుకుని చనిపోయాడు. ఫ్యాన్ సీలింగ్ కు చైతన్య ఉరివేసుకున్నట్లు కెపిహెచ్ బి పోలీసులు తెలిపారు.

Read More
Next Story