
Solar Power|తెలంగాణలో పోడు భూముల సాగుకు సోలార్ పవర్
తెలంగాణలో పోడు భూముల సాగుకు సోలార్ పవర్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సాగుకు సోలార్ పవర్ ను అందించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. ప్రజావాణి ఏడాది పూర్తి అయిన సందర్భంగా మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణిని కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
- రాష్ట్ర ప్రజల అవసరాలు, వారి ఇబ్బందులు నేరుగా చెప్పుకోవడానికి ప్రజా ప్రభుత్వం ప్రజావాణి ని ఏర్పాటు చేసిందని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజావాణి దరఖాస్తులకు పరిష్కారం దొరికిందని ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.ప్రజలకు జవాబుదారీగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు.
- గత పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ పోడు రైతుల సమస్యలను పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు లక్ష్యాలను గత పాలకులు విస్మరించారని ఆయన పేర్కొన్నారు.
ప్రజావాణిలో 424 దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళ వారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 424 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 108, మైనార్టీ సంక్షేమ శాఖ సంబంధించి 100,రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 65, విద్యుత్ శాఖ కు సంబంధించి 57, పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ సంబంధించి 13, ప్రవాసీ ప్రజావాణి సంబంధించి 5, ఇతర శాఖలకు సంబంధించి 76 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Next Story