
ఫిరాయింపు ఎంఎల్ఏల విచారణ ఇప్పట్లో అవుతుందా ?
సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ మొదలుపెట్టినా హాజరయ్యింది నలుగురు ఎంఎల్ఏలు మాత్రమే.
ఫిరాయింపు ఎంఎల్ఏలపై విచారణ గడువును పొడిగించాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రింకోర్టును రిక్వెస్టు చేశారు. తెలంగాణ అసెంబ్లీ తరపున లాయర్లు శుక్రవారం కోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల(BRS defection MLAs) విచారణకు సుప్రింకోర్టు విధించిన గడువు మూడునెలలు అక్టోబర్ 31వ తేదీతో ముగుస్తుంది. అయితే విచారణ ఇంకా పూర్తికాలేదు. అనర్హత వేటును ఎదుర్కొంటున్న పదిమంది ఎంఎల్ఏలను విచారించి రిపోర్టు సబ్మిట్ చేయాలని సుప్రింకోర్టు(Supreme court) మూడునెలల క్రితం స్పీకర్ ను ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణ జరిపి రిపోర్టు అందచేసేందుకు అప్పట్లో స్పీకర్(Telangana Assembly speaker) కు సుప్రింకోర్టు మూడునెలలు మాత్రమే గడువిచ్చింది.
ఇపుడు విషయం ఏమిటంటే సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ మొదలుపెట్టినా హాజరయ్యింది నలుగురు ఎంఎల్ఏలు మాత్రమే. ఎందుకంటే కోర్టులో జరిగినట్లుగానే ప్రతి ఎంఎల్ఏ తరపున వాదన వినిపించేందుకు లాయర్లు, ప్రతివాదన వినిపించేందుకు బీఆర్ఎస్ ఎంఎల్ఏల తరపున లాయర్లకు స్పీకర్ అవకాశాలు ఇస్తున్నారు. అంటే ఇదంతా చాలా పెద్ద ప్రొసీజర్. అందుకనే చాలా సమయం పడుతోంది. ఇదే విషయాన్ని స్పీకర్ తరపు లాయర్లు తమ పిటీషన్లో సుప్రింకోర్టుకు విన్నవించారు. మధ్యలో మూడువారాలు అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్ళొచ్చారు.
పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల్లో నలుగురిని విచారించటానికి స్పీకర్ కు మూడునెలలు పట్టింది. మరి మిగిలిన ఆరుగురు ఎంఎల్ఏలను విచారించాలంటే ఎన్ని నెలలు అవసరం అవుతుంది ? అయితే స్పీకర్ తరపు లాయర్లు మాత్రం విచారణకు అదనంగా మరో రెండునెలల గడువు కోరారు. సుప్రింకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి




