ఫిర్యాదుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి: జీహెచ్ఎంసీ కమిషనర్  ఇలంబర్తి
x

ఫిర్యాదుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి: జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి

గ్రేటర్ హైదరాబాద్ లో ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు.ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడారు.


జీహెచ్ఎంసీ అధికారులు ప్రజా వాణిలో వచ్చే ఫిర్యాదులకును పరిష్కరించాలని నగర కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అక్రమ నిర్మాణాలను నియంత్రించడంపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి ఆదేశించారు.జీహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.


ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలు పరిష్కరించడం ఫై ఆయా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.ప్రజలకు సాయం అందిచడమే ప్రజావాణి ముఖ్య ఉద్దేశమన్నారు.ప్రజావాణి కార్యక్రమానికి హెచ్ ఓ డి లు తప్పనిసరిగా హాజరు కావాలని కమిషనర్ స్పష్టం చేశారు.డీసీలు, సెక్షన్ ఆఫీసర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులతో ప్రతి నెల సమీక్ష సమావేశం నిర్వహించి, ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? నిబంధనల మేరకు ఎన్నింటికి నోటీసులు జారీ చేశారు? ఏం యాక్షన్ తీసుకున్నారు? తదితర విషయాలపై సమీక్షించాలని ఆయన సూచించారు.

కోర్టు కేసులపై సమీక్ష
కోర్టు కేసులన్నింటిఫై సమీక్షించాలని లీగల్ అధికారికి సూచించారు.హెల్త్ విభాగానికి సంబందించి జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, ఇతర అన్ని అంశాలను రెగ్యులర్ గా సమీక్షించి మినిట్స్ చేయాలని సి ఎం హెచ్ ఓ కు ఆదేశించారు.వెటర్నరీ విభాగానికి వచ్చిన ఫిర్యాదుల వివరాలను, సెంటర్ వారీగా స్టేరిలైజ్ చేసిన కుక్కల వివరాల నివేదికను అందజేయాలని చీఫ్ వెటర్నరీ అధికారిని ఆదేశించారు.అన్ని విభాగాల అధికారులు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి త్వరిత గతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులన్నింటినీ డిపార్ట్మెంట్ వారీగా కంప్యూటర్లో నమోదు చేసి,ఏ సర్కిల్ నుంచి ఎన్ని వచ్చాయి, సర్కిళ్ల నుంచి ఏ సమస్యల పై ఫిర్యాదులు వస్తున్నాయన్న రిపోర్ట్ ఇవ్వాలని కమిషనర్ సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శివ కుమార్ నాయుడు,రఘు ప్రసాద్, నళిని పద్మావతి సత్యనారాయణ,చంద్రకాంత్ రెడ్డి, పంకజ, యాదగిరి రావు సి ఈ భాస్కర్ రెడ్డి, సి సి పి శ్రీనివాస్, అడిషనల్ సి సిపి గంగాధర్ చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకీల్ చీఫ్ ఎంటోమలో జి డాక్టర్ రాంబాబు ఎస్టేట్ అధికారి శ్రీనివాసరెడ్డి, వాటర్ వర్క్స్ జి ఏం సాయి రమణ జాయింట్ కమిషనర్లు మహేష్ కులకర్ణి,ఉమా ప్రకాష్, హౌసింగ్ యస్ ఈ కృష్ణవ్రావు, డిప్యూటీ సి ఈ పనస రెడ్డి, హౌసింగ్ ఈ ఈ రాజేశ్వరరావు.తదితరులు పాల్గొన్నారు.


Read More
Next Story