
ప్రత్యేక యాప్ ద్వారా సృష్టి స్కాం నిందితురాలు లావాదేవీలు
ఒక రోజు కస్టడీలో డాక్టర్ నమ్రత వెల్లడి
ప్రత్యేక యాప్ ద్వారా సృష్టి స్కాంలో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రత ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్టు సీసీ ఎస్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రిమాండ్ ఖైదీగా ఉన్న డాక్టర్ నమ్రతను ఒక రోజు పోలీసు కస్ట డీ తీసకున్నప్పుడు ఈ విషయం వెల్లడైంది. నమ్రత గ్యాంగ్ ఈ యాప్ ను వినియోగించారు. పిల్లలను కొనుగోళ్లకు సంబంధించి న బ్రోకర్లు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఈ యాప్ నే వినియోగించేవారు.
సరోగసీ పేరుతో పిల్లలు లేని దంపతుల నుంచి కోట్లాది రూపాయలు డాక్లర్ నమ్రత వసూలు చేశారని పోలీసుల కస్టడీలో వెల్లడైంది. శిశువుల కొనుగోళ్లు, అమ్మకాలు , ప్రభుత్వ డాక్టర్ల పాత్ర , బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
విజయవాడ. విశాఖపట్ణణం తదితర ప్రాంతాల్లో శిశువుల కొనుగోళ్లు , విక్రయాలు జరిగినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టించిన సృష్టి స్కాం వివరాలు రాబడుతుంటే విస్తుపోయే నిజాలు వెల్లడౌతున్నాయి. ఆంధ్ర మెడికల్ కాలేజి నుంచి ఎంబిబియస్ పట్టా పుచ్చుకున్న డాక్టర్ నమ్రత డాక్టర్ గా ప్రాక్టీసు చేసిన దాఖలాలు లేవు. తొలుత ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభించిన నిందితురాలు తర్వాతికాలంలో పిల్లలు పుట్టాలంటే సరోగసీకి వెళ్లమని పురమాయించే వారు. సికింద్రాబాద్ కేంద్రంగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభించారు. అసలు పేరును దాచి పెట్టి డాక్టర్ నమ్రతగా చెలామణి అయ్యారు. . ఆంధ్ర మెడికల్ కాలేజిలో మరో పేరు వుంది.