సిద్దిపేటలో బయటపడ్డ రాతియుగంనాటి పనిముట్లు
x

సిద్దిపేటలో బయటపడ్డ రాతియుగంనాటి పనిముట్లు

సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రానికి చెందిన ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ సూక్ష్మరాతి పనిముట్లను గుర్తించాడు.


సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రానికి చెందిన ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ సూక్ష్మరాతి పనిముట్లను గుర్తించాడు. గత కొన్ని సంవత్సరాలుగా తన స్వంత గ్రామంలో పరిశోధనలు చేస్తున్న ఆయన కొత్తరాతి యుగంనాటి రాతి గొడ్డళ్ళు, శాతవాహనులకాలంనాటి టెర్రకోట బొమ్మలు, దేవతా విగ్రహలు ఎన్నో గుర్తించాడు. ఇప్పుడు కొత్తగా గ్రామానికి దక్షిణం వైపున ఉన్న ‘జోకిరమ్మబండ’ మీద సూక్ష్మరాతి పరికరాలు (మైక్రోలిథిక్ టూల్స్) గుర్తించాడు.

ఇవి చిన్నరాతి పనిముట్లు, ఇందులో కొన్ని ఒక సెంటీమీటర్ పొడవు ఉండగా మరికొన్ని అంతకంటే చిన్నవిగా ఉన్నాయని, వీటిలో సన్నకత్తులు(బ్లేడ్లు), బాణం ములికి వంటి పరికరాలు క్వార్జ్, చెర్ట్, చాల్కోలిథ్, జాస్పర్ వంటి రాళ్ళతో తయారు చేయబడినవి ఉన్నాయని ఆయన తెలిపారు. వీటి వయసు క్రీ.పూ. 8000 సంవత్సరాల నుంచి 4000 సంవత్సరాల కాలానికి చెందినవి కనుక కొన్నివేల సంవత్సరాల క్రితమే ఈ బండ మానవ ఆవాసంగా ఉండేదని ఆయన తెలిపారు.

Read More
Next Story