Allu Arjun | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళదాడి
x
Stone pelting on Bunny house

Allu Arjun | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళదాడి

మహిళ మరణానికి కారణమని విద్యార్ధులు ఆరోపిస్తు అర్జున్ ఇంటి ముందు ఆందోళన చేశారు


అల్లుఅర్జున్ ఇంటిమీద రాళ్ళతో దాడిజరిగింది. ఆదివారం సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్ధులు అల్లుఅర్జున్(Allu Arjun) ఇంటిముందు పెద్ద ధర్నా చేశారు. సంధ్యా ధియేటర్ (Sandhya Theatre)తొక్కిసలాటలో మహిళ మరణానికి కారణమని విద్యార్ధులు ఆరోపిస్తు అర్జున్ ఇంటి ముందు ఆందోళన చేశారు. వీళ్ళు ఎంత ఆందోళనచేసినా ఇంట్లోనుండి స్పందనలేకపోవటంతో విద్యార్ధులకు మండిపోయింది. దాంతో ఆవేశంతో అందరు ఇంట్లోకి వెళ్ళేందుకు ప్రయత్నంచేశారు. ఆ ప్రయత్నాన్ని సెక్యూరిటి వాళ్ళు అడ్డుకోవటంతో కొందరు విద్యార్ధులు రాళ్ళు తీసుకుని ఇంటిపైకి విసిరారు(Stone Pelting on Allu Arjun House). బాధిత కుటుంబానికి అర్జున్ కోటిరూపాయల పరిహారం చెల్లించాలని విద్యార్ధులు పెద్దఎత్తున డిమాండ్లు చేశారు. అల్లుఅర్జున్ సెక్యూరిటి వాళ్ళు ఫోన్ చేయటంతో పోలీసులు ఇంటిదగ్గరకు చేరుకున్నారు. ఇపుడు పరిస్ధితి అదుపులోనే ఉంది.

Read More
Next Story