యూఎస్‌లో చదవాలనుకునే వారికి కష్టం అపోహ మాత్రమే..
x

యూఎస్‌లో చదవాలనుకునే వారికి కష్టం అపోహ మాత్రమే..

ప్రతి ఏటా భారత దేశం నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది.


ప్రతి ఏటా భారత దేశం నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. వీరిలో చాలా మంది ఉద్యోగాల కోసం వెళ్తుంటే.. మరికొందరు విద్యాభ్యాసం కోసం వెళ్తుంటారు. ఈ క్రమంలోనే అక్కడ ఇబ్బందులు లేకుండా నివసించడం కోసం హెచ్ 1బీ వీసాలను కోరుకునేవారి సంఖ్య భారీగానే ఉంటుంది. కాగా వారిలో అధికులు తెలంగాణ వారేనని యూఎస్ అటార్నీ, గెహీ ఇమ్మిగ్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్ ప్రిన్సిపల్ ఫౌండర్ నరేష్ ఎం గెహీ తెలిపారు. అలాంటి వారికి సహాయం అందించడం కోసమే హైదరాబాద్‌లో తమ సంస్థ శాఖను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మరోసారి పీఠం అదిష్ఠిస్తే విద్యార్థులకు కష్టం అనేది ఒక అపోహగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్ వచ్చిన తర్వాత ఇన్ని కష్టాలు ఉండవని చెప్పారు. ఎవరు అధికారంలోకి వచ్చినా సమస్య ఉండొద్దు అంటే.. అమెరికా ప్రభుత్వ గుర్తింపు ఉన్న యూనివర్సిటీలకే విద్యార్థులు అడ్మిషన్ కోసం అప్లై చేసుకోవాలని సూచించారు. హెచ్ 1బీ వీసా తిరస్కరకు గురైందని బాధ పడొద్దని, ఓ1 వీసాలతో కూడా అమెరికాలో ఉండొచ్చని ఆయన చెప్పారు.

‘‘సైన్స్, కళలు, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్ లేదా మోషన్ పిక్చర్, టెలివిజన్ పరిశ్రమలలో ఉండి తమ ప్రతిభ పరంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందితే వారు ఓ1 పొందడానికి అర్హులు. హెచ్ 1బీ వీసాలకు పరిమితి ఉంటుంది. ఓ1 వీసాలకు అటువంటిది ఏమీ ఉండదు. ఈ వీసా పొందిన వారు తమ రంగాలలో పని కొనసాగించాల్సి ఉంటుంది. పెట్టుబడిదారుగా ఈబీ-5 వీసాలను సులభంగా పొందొచ్చు. సుమారు 8లక్షల డాలర్లను పెట్టుబడి పెడితే ఈ వీసా వచ్చేస్తుంది’’ అని ఆయన చెప్పారు.

‘‘మాకు న్యూయార్క్‌లో మూడు ఆఫీసులు ఉన్నాయి. తెలంగాణ నుంచి మాకు ఎక్కువగా హెచ్ 1బీ వీసాలకు సంబంధించి కేసులు వస్తున్నాయి. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. అది కాకుండా ఓ1 వీసాలు కూడా వీటికి ఒక మార్గంలో పరిష్కారంలా ఉంటాయి. వీటి ద్వారా కూడా అమెరికాలో నివసించొచ్చు’’ అని ఆయన పునరుద్ఘాటించారు.

Read More
Next Story