సీఎం రేవంత్‌కు సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల కృతజ్ఞతలు
x

సీఎం రేవంత్‌కు సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల కృతజ్ఞతలు

వ‌స‌తిగృహ విద్యార్థుల‌కు డైట్,కాస్మోటిక్ చార్జీలను సీఎం పెంచారు.ఈ నేపథ్యంలో సచివాలయంలో రేవంత్ రెడ్డిని సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.రాష్ట్రంలో అందరికీ విద్య,వైద్యం,ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం పేర్కొన్నారు. అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని చెప్పారు.బుధవారం సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

- రాష్ట్రంలో 21వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని సీఎం పేర్కొన్నారు. సామాజిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహిస్తోందన్నారు.
- ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.ప్రతీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు.
- చదువుతో పాటు స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని,అందుకే విద్యార్థులకు, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు.టాటా ఇనిస్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామన్నారు.
- చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని, విద్యార్థులు క్రీడల్లో రాణించాలని వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చెప్పారు.వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
- ప్రభుత్వ వ‌స‌తిగృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఖమ్మం జిల్లా వైరా, మధిర నియోజకవర్గాల నుంచి సచివాలయానికి మహాత్మా జ్యోతిబాపూలే, సాంఘీక సంక్షేమ హాస్టల్స్ పాఠశాల,కళాశాల విద్యార్థులు తరలివచ్చారు.


Read More
Next Story