కాంగ్రెస్ జన జాతర సభ సక్సెస్...సెంటిమెంట్ ఫలించేనా?
పార్లమెంట్ ఎన్నికల వేళ తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభ సక్సెస్ అయింది. రాహుల్ గాంధీ పాంచ్ న్యాయ్ పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ గత ఏడాది సెప్టెంబరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయ భేరి యాత్రను తుక్కుగూడలో నిర్వహించి సమరశంఖం పూరించారు. నాటి తుక్కుగూడ సభతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలోని జన జాతర సభను శనివారం రాత్రి నిర్వహించింది. గతంలో ఆరు గ్యారంటీలతో మేనిఫెస్టోను ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ అదే సెంటిమెంటుతో కాంగ్రెస్ జనజాతర సభ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచిచూడాల్సిందే. రాహుల్ గాంధీ సభకు రాగానే న్యాయపత్రం పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టోను రాహుల్ గాంధీ విడుదల చేశారు.
ఇదీ కాంగ్రెస్ మేనిపెస్టో
1. నిరుద్యోగ యువకులకు లక్ష రూపాయల జీతం వచ్చేలా ఉద్యోగాల కల్పిన.2.నారీ న్యాయ్‌లో భాగంగా నిరుపేద కుటుంబంలో ఓ మహిళకు లక్ష రూపాయలు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.3. రైతులకు హామీ రైతులకు రుణమాఫీ, గిట్టుబాటు ధర కల్పన 4. కార్మికులకు న్యాయం చేస్తాం దేశంలో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తాం. రోజు కూలీ కనీసం 400 రూపాయలు చెల్లించేలా చర్యలు తీసుకోబోతున్నామని రాహుల్ ప్రకటించారు.5. దేశంలో 50శాతం జనాభా వెనుకబడిన వర్గాలు, 15 శాతం 8 గిరిజనులు ఆదీవాసీలు 15 శాతం మైనారిటీలు, 5 శాతం జనాభా నిరుపేదలు జనరల్ కేటగిరి వారున్నారు. 90 శాతం జనాభా నుంచి మీడియా కంపెనీ యజమానులను చూస్తే ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాల వారు ఎవరూ కనిపించరు, పెద్దకంపెనీల యజమానులు, ధనవంతులను చూస్తే బలహీనవర్గాల వారు ఎవరూ లేరు. అందుకే రిజర్వేషన్ పరిమితిని తొలగించేలా రాజ్యాంగ సవరణ చేస్తామని రాహుల్ ప్రకటించారు.
ఇదీ ప్రజల మేనిఫెస్టో
ప్రజల మాట విని కాంగ్రెస్ పార్టీ రూపొందించిందని రాహుల్ గాంధీ చెప్పారు. భారతదేశ ముఖచిత్రం ఈ మేనిపెస్టో మార్చి వారి నిరుపేదలు, మహిళలు, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని రాహుల్ చెప్పారు. ‘‘మేం తెలంగాణలో ఇచ్చిన హామీలను ఎలా అమలు చేశామో అలాగే దేశంలోనూ తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణలో బీ టీంను ఓడించాం
తెలంగాణలో బీజేపీ బీ టీంను ఓడించామని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏ టీంను ఓడిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తుందని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడు కునేందుకే తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. నరేంద్ర మోదీ వద్ద మీడియా, డబ్బు, సీబీఐ,ఈడీ అన్నీ ఉన్నాయని, కానీ మావద్ద మాత్రం జనం ప్రేమ మాత్రమే ఉందన్నారు. విజయం ప్రజలదేనని రాహుల్ జోస్యం చెప్పారు. పార్లమెంటు అభ్యర్థులతో రాహుల్ గాంధీ చేతులు పట్టుకొని ఫొటో దిగి ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని రాహుల్ గాంధీ కోరారు.
కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడిన తుక్కుగూడ
తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర సభ కాంగ్రెస్ పార్టీ జెండాలతో రెపరెపలాడింది. సభ ప్రాంగణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భారీ కటౌట్లే ఏర్పాటు చేశారు. తెలుగు మేనిఫెస్టోను ఈ సభావేదికగా రాహుల్ విడుదల చేశారు.జనజాతర సభలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ 15 మంది ఎంపీ అభ్యర్థులు, మంత్రులు, రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని తెలంగాణ మంత్రులు ప్రజలకు పిలుపునిచ్చారు.
Next Story