
Maganti Sunitha, BRS candidate
పోలీసులపై సునీత తీవ్ర ఆగ్రహం
కేంద్రంలోకి తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని పోలీసులను ఆమె నిలదీశారు
బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఉదయం పోలింగ్ సందర్భంగా ఆమె తన మద్దతుదారులతో బోరబండ డివిజన్లోని స్వరాజ్ నగర్ పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఆమె తన మద్దతుదారులతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళటానికి ప్రయత్నించినపుడు పోలీసులు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి ఎవరినీ వెళ్ళనిచ్చేదిలేదని పోలీసులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో ఆమెకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. కేంద్రంలోకి తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని పోలీసులను ఆమె నిలదీశారు. ఒకవైపు కాంగ్రెస్ నేతలు లోపలకు వెళుతున్నపుడు తమను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పోలీసుల వైఖరి ఏకపక్షంగా ఉందని మండిపడ్డారు.
Next Story

