
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట
తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు భారీ ఊరట లభించింది. హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌లపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదంతా బోగస్ ఆరోపణలే అనడానికి సుప్రీంకోర్టు నిర్ణయం ఒక నిదర్శనమని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.
అయితే హరీష్ రావు, రాధాకిషన్‌లకు వ్యతిరేకంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను గతంలో హైకోర్టు క్వాష్ చేసింది. ఆ విషయంలో హైకోర్టు నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేసింది. ఆ పిటిషన్లపై జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం విచారించింది. అనంతరం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ పిటిషన్లు కొట్టివేసింది.

