Supreme Court
x

నష్టాన్ని పూడ్చకపోతే సీఎల్ జైలుకెళ్లాల్సిందే.. సుప్రీంకోర్టు

గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్లతో పనులు ప్రారంభించడానికి ముందు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? లేదా? అనేది స్పష్టం చేయండన్న న్యాయస్థానం.


హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం దేశమంతా సంచలనంగా మారింది. 400 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం వేలం వేయడాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. ఆ వేలానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేశారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని, వాటితో రియల్ ఎస్టేట్ దందా చేస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. కాగా ఆ భూములు ప్రభుత్వానివేనని టీజీఐఐసీ పేర్కొంది. కానీ ఈ అంశంపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. ఈ విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఇదే అంశంపై మరోసారి విచారణ జరగ్గా.. కంబె గచ్చిబౌలిలో జరిగిన నష్టాన్ని పూడ్చాలని, లేనిపక్షంలో సీఎస్‌ను జైలుకు పంపాల్సి వస్తుందని న్యాయస్థానం పేర్కొంది.

సుప్రీంకోర్టు 52వ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ భూముల వ్యవహారంపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్లతో పనులు ప్రారంభించడానికి ముందు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? లేదా? అనేది స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది బెంచ్. అంతేకాకుండా లాంగ్ వీకెండ్‌ చూసుకుని ఎందుకు పనులు ప్రారంభించారని మరోసారి ప్రశ్నించింది. ఆ భూముల్లో జరిగిన నష్టాన్ని పూడ్చాలని లేని పక్షంలో చీఫ్ సెక్రటరీ సహా కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది న్యాయస్థానం. కాగా కేంద్ర సాధికార సంస్థ దాఖలు చేసిన నివేదికపై కౌంటర్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరికొంత సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు.

గతంలో ఏమందంటే..

కంచె గచ్చిబౌలి వ్యవహారంలో సీఎస్‌ను ప్రతివాదిగా సుప్రీంకోర్టు చేర్చింది. అదే విధంగా ఆఘమేఘాలపైన అక్కడ పనులు ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ 400 ఎకరాలు అటవీ భూమి కాకపోయినా.. భారీ ఎత్తున చెట్లు కొట్టేయడానికి సీఎస్ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది. గచ్చిబౌలి భూముల్లో పెద్దఎత్తున జరుగుతున్న అభివృద్ధి పనులను న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ఆ ప్రాంతంలో విస్తృతంగా వృక్షసంపద నిర్మూలన జరుగుతుందని ధర్మాసనం పేర్కొంది. దాదాపు 100 ఎకరాలను డెవలప్‌మెంట్‌కు సిద్ధం చేసేటంత యంత్ర సముదాయం అక్కడ మోహరించి ఉందని హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదిక పేర్కొంది. ప్రభుత్వం చేపడుతున్న ఈ పనులను అక్కడ ఉన్న వన్యప్రాణులను ప్రభావితం చేస్తుందని ధర్మాసనం పేర్కొంది. 1932 నిబంధనల ప్రకారం నెల రోజుల్లోగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఆరు నెలల్లోగా ఆ ప్రాంతంలో పరిశీలన అంచనా పనులను పూర్తి చేసి నివేదిక అందించాలని తెలిపింది.

Read More
Next Story