నాగచైతన్య-సమంత విడాకులకు కారణం బయటపెట్టిన మంత్రి
x
Naga Chaitanya and Samanta

నాగచైతన్య-సమంత విడాకులకు కారణం బయటపెట్టిన మంత్రి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ పెద్ద బాంబు పేల్చారు. అదేమిటంటే నాగచైతన్య-సమంత విడాకులకు కారణం కేటీఆరే అని ఆరోపించారు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ పెద్ద బాంబు పేల్చారు. అదేమిటంటే నాగచైతన్య-సమంత విడాకులకు కారణం కేటీఆరే అని ఆరోపించారు. వీళ్ళ విడాకులకు కారణం కేటీఆరే అని చెప్పిన కొండా సురేఖ ఏ విధంగా కారణమయ్యారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. సినిమా ఫీల్డులోని చాలామంది హీరోయిన్ల ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు కూడా మండిపడ్డారు. ఎంతోమంది హోరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నట్లు ఆరోపించారు.

తాను మత్తుపదార్ధాలకు బానిస అవటమే కాకుండా చాలామంది హీరోయిన్లను మత్తుకు అలవాటు చేయించారని కేటీఆర్ పై మండిపడ్డారు. చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్ళిళ్ళు చేసుకుని సినిమా ఫీల్డు నుండి బయటకు వెళ్ళిపోవటానికి కారణం కూడా కేటీఆరే అన్నారు. మత్తుపదార్ధాలకు అలవాటు చేయటమే కాకుండా చాలామంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసిన విషయం సినిమా ఫీల్డులో అందరికీ తెలిసిన విషయమే అన్నారు. హీరోయిన ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేయించారనే విషయాన్ని తాను గతంలో కూడా చెప్పిన విషయాన్ని ఇపుడు సురేఖ గుర్తుచేశారు. అయితే అప్పట్లో తాను ఎవరిపేర్లను బయటపెట్టలేదన్నారు.

ఇపుడు నాగచైతన్య-సమంత విడాకులకు కారణం మాత్రం కేటీఆరే అని పదేపదే సురేఖ చెప్పారు. ఇంతచెప్పిన సురేఖ కేటీఆర్ ఎంతమంది హీరోయిన్లకు మత్తుపదార్ధాలను అలవాటు చేశారు ? ఎంతమంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయించారనే విషయాలను మాత్రం చెప్పలేదు. అసలు నాగచైతన్య-సమంతతో కేటీఆర్ కు ఉన్న సంబంధం ఏమిటో కూడా మంత్రి చెప్పలేదు. ఇంతచెప్పిన మంత్రి హీరోయిన్లలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయించారనే విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదో అర్ధంకావటంలేదు.

అసలు ఈ సమస్యంతా కొండాసురేఖకు బీజేపీ ఎంపీ రఘునందనరావు నూలుదండ వేయటంతో మొదలైంది. సిరిసిల్లలో జరిగిన ఒక కార్యక్రమంలో కొండా సురేఖ, ఎంపీ రఘునందనరావు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఎంపీ మంత్రికి ఒక నూలుదండను వేశారు. దాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అసభ్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని కొండా సురేఖ మంగళవారం ఉదయం మీడియా సమావేశంలోనే భోరున ఏడ్చారు. ఇదే విషయమై మంత్రి కేటీఆర్, హరీష్ రావును నిలదీశారు. దాంతో హరీష్ స్పందించి సురేఖకు వ్యతిరేకంగా జరిగిన ట్రోలింగును ఖండించారు. అయితే కేటీఆర్ మాత్రం స్పందించలేదు. దాంతో మంత్రికి మండినట్లుంది. అందుకనే ఈరోజు కేటీఆర్ పై డైరెక్టుగానే ఆరోపణలతో విరుచుకుపడ్డారు.

Read More
Next Story