Thrilling Aerial Display|సూర్యకిరణ్ బృందం వైమానిక విన్యాసాలు అదుర్స్
భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ శుక్రవారం జరిపిన వైమానిక విన్యాసాలు నగర వాసులను అలరించాయి. 9 విమానాలతో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ శుక్రవారం జరిపిన వైమానిక విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆసియాలోనే 9 విమానాలతో విన్యాసాలు చేసి ప్రశంసలందుకున్నారు.
- సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీంను 1996వ సంవత్సరంలో స్థాపించారు. ఈ బృందం ప్రపంచంలోని కొన్ని ప్రముఖ జట్లలో ఒకటిగా నిలిచింది.
- చైనా, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, సింగపూర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలు ఇచ్చింది. ఈ అసాధారణమైన బృందం భారతదేశం అంతటా 700 ప్రదర్శనలను ఇచ్చింది.
తెలంగాణలోని సుందరమైన హుస్సేన్ సాగర్ సరస్సుపై శుక్రవారం మధ్యాహ్నం 3-5 గంటల మధ్య జరిపిన వైమానిక విన్యాసాలు మంత్రముగ్దులను చేశాయి. ఈ ఎయిర్‌షో ప్రేక్షకులకు గుర్తుండిపోయే ఈవెంట్‌గా నిలిచింది.ఊపిరి పీల్చుకునే ఏరోబాటిక్ విన్యాసాలను ప్రదర్శించాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సూర్యకిరణ్ బృందం
సూర్యకిరణ్ బృందం 9 హాక్ ఎంకే 132 విమానాలతో 5 మీటర్ల దూరంలో అత్యంత సమీపంలో ఎగిరాయి.ఈ జట్టులో 12 మంది పైలెట్లు ఉన్నారు. టీమ్ లీడర్ సూ-30 ఎంకేఐ పైలట్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి, డిప్యూటీ లీడర్‌గా గ్రూప్ కెప్టెన్ సిద్ధేష్ కార్తిక్ వ్యవహరించారు. ఇతర పైలట్‌లలో స్క్వాడ్రన్ లీడర్ జస్దీప్ సింగ్, స్క్వాడ్రన్ లీడర్ హింఖుష్ చందేల్, స్క్వాడ్రన్ లీడర్ అంకిత్ వశిష్ట్, స్క్వాడ్రన్ లీడర్ విష్ణు, స్క్వాడ్రన్ లీడర్ దివాకర్ శర్మ, స్క్వాడ్రన్ లీడర్ గౌరవ్ పటేల్, వింగ్ కమాండర్ రాజేష్ కాజ్లా, వింగ్ కమాండర్ అర్జున్ పటేల్, వింగ్ కమాండర్ ఆల్ డబ్ల్యుడిప్ కమాండర్ కుల్దీప్ ఉన్నారు. వారి సాంకేతిక బృందానికి వింగ్ కమాండర్ అభిమన్యు త్యాగి, స్క్వాడ్రన్ లీడర్ సందీప్ ధయాల్, ఫ్లైట్ లెఫ్టినెంట్ మనీల్ శర్మ నాయకత్వం వహించారు.
అధునాతన జెట్ ట్రైనర్ హాక్ ఎంకే 132 విమానం
సూర్యకిరణ్ బృందం నడిపిన విమానం హాక్ ఎంకే 132 అధునాతన జెట్ ట్రైనర్. భారత వైమానిక దళంలో కొత్తగా నియమించిన పైలెట్లకు ఫైటర్ ఫ్లయింగ్ శిక్షణ ఇవ్వడానికి ఈ విమానం ఉపయోగిస్తున్నారు. ఈ విమానం దేశంలోని ఏవియేషన్ టెక్నాలజీని ప్రదర్శిస్తూ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది.
Next Story