తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం
x

తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం

తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం సాయంత్రం పదవీ బాధ్యతలు తీసుకున్నారు.


తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం సాయంత్రం పదవీ బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే.. జిష్ణుదేవ్ చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, శాసన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

కాగా, జులై 27 న తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తవారు ఏడుగురుని గవర్నర్లుగా నియమించగా, ముగ్గురు గవర్నర్లను బదిలీ చేశారు. అందులో భాగంగా ఝార్ఖండ్ గవర్నర్, తెలంగాణ ఇంచార్జ్ గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణని కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకి బదిలీ చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న రమేష్ బైస్ ను తప్పించింది. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా నియమితులవ్వగా.. ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత జిష్ణుదేవ్ ని తెలంగాణ గవర్నర్ గా నియమించడం విశేషం. జిష్ణుదేవ్ ఈరోజు సాయంత్రం 5.30 గంటలకి తెలంగాణ గవర్నర్ గా ఛార్జ్ తీసుకున్నారు.

జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాజకుటుంబానికి చెందిన వారు. జిష్ణు దేవ్ వర్మ 1957 ఆగస్టు 15న జన్మించారు. దేవ్ వర్మ 1990ల ప్రారంభంలో రామజన్మభూమి ఉద్యమం సమయంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. 1993లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన 2018 లో త్రిపుర శాసనసభలోని చరిలం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. 2018 నుంచి 2023 వరకు త్రిపురకు 2వ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చారిలం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర నాల్గవ గవర్నర్ గా నియమితులయ్యారు.

Read More
Next Story