తాజ్ బంజారా హోటల్ యాజమాన్యానికి షాక్
x
Taj Banjara seized

తాజ్ బంజారా హోటల్ యాజమాన్యానికి షాక్

హోటల్ సీజ్ అయినట్లు తెలుసుకున్న యాజమాన్యానికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయ్యింది.


హైదరాబాద్ లోని ప్రముఖ హోటళ్ళల్లో ఒకటైన తాజ్ బంజారా హోటల్ సీజ్ అయ్యింది. హోటల్ ను సీజ్ చేసినట్లు మున్సిపల్ ఉన్నతాధికారులు ప్రకటించారు. రెండేళ్ళుగా బకాయిలను చెల్లించకపోవటమే హోటల్ ను సీజ్ చేయటానికి ప్రధాన కారణం. రు. 1.43 కోట్ల బకాయిలు చెల్లించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) అధికారులు తాజ్ బంజారా హోటల్(Taj Banjara Hotel) యాజమాన్యానికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఉపయోగంలేకపోయింది. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఉపయోగంలేకపోవటంతో చివరకు రెడ్ నోటీసును జారీచేశారు. రెడ్ నోటీసు జారీఅయినా హోటల్ యాజమాన్యం లెక్కచేయలేదు. దాంతో ఇక లాభంలేదని చెప్పి శుక్రవారం ఉదయం హోటల్ పై మున్సిపల్ ఉన్నతాధికారులు దాడిచేసి సీజ్ చేసేశారు. హోటల్ సీజ్ అయినట్లు తెలుసుకున్న యాజమాన్యానికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయ్యింది.

ఎందుకంటే హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటళ్ళల్లో ఒకటైన తమ హోటల్ జోలికి ఎవరొస్తారన్న ధీమాతోనే యాజమాన్యం మున్సిపల్ అధికారుల నోటీసులను లెక్కచేయలేదు. ఈహోటల్ కు ప్రముఖ సెలబ్రిటీలే కాకుండా క్రికెటర్లు హైదరాబాదుకు ఎప్పుడు వచ్చినా ఈ హోటల్ లోనే బసచేస్తుంటారు. దేశ, విదీశీ అతిధులు, ప్రముఖ రాజకీయనేతలు కూడా ఇదే హోటల్లో బసచేయటానికి ఇష్టపడతారు. ఇంత ప్రముఖమైన హోటల్ కాబట్టే తమ జోలికి మున్సిపల్ అధికారులు రారని యాజమాన్యం బాగా నిర్లక్ష్యంగా ఉంది. యాజమాన్యం వైఖరిని గమనించిన మున్సిపల్ అధికారులు సడెన్ గా హోటల్ కు చేరుకుని సీజ్ చేసేశారు. దాంతో యాజమాన్యంకు షాక్ కొట్టినట్లయ్యింది.

మున్సిపాలిటి నుండి వచ్చిన నోటీసులకు యాజమాన్యం ఏదైనా సమాధానం చెప్పుంటే పరిస్ధితి వేరుగా ఉండేది. నోటీసులను అసలు పట్టించుకోకపోవటంతోనే ఇపుడు హోటల్ సీజ్ అయిపోయింది. ఎప్పుడైతే మున్సిపల్ అధికారులు తమ హోటల్ ను సీజ్ చేశారో వెంటనే యాజమాన్యం కాళ్ళబేరానికి వచ్చేసింది. చెల్లించాల్సిన రు. 1.43 కోట్ల బకాయిల్లో వెంటనే సగంచెల్లించేసింది. మిగిలిన బకాయిలు వారంరోజుల్లో చెల్లిస్తామని మున్సిపాలిటీకి యాజమాన్యం రాతమూలకంగా రాసిచ్చింది. దాంతో సీజ్ చేసిన హోటల్ తెరిచేందుకు అధికారులు అనుమతించటంతో యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది.

Read More
Next Story