Rescue Please |సౌదీకి డ్రైవరుగా తీసుకెళ్లి గొర్రెలు కాయమన్నారు
x

Rescue Please |సౌదీకి డ్రైవరుగా తీసుకెళ్లి గొర్రెలు కాయమన్నారు

డ్రైవరుగా పని పనిచేసేందుకు అని చెప్పి సౌదీ అరేబియాకు తీసుకువెళ్లి గొర్రెలు కాయమన్నారని తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు.


తెలంగాణకు చెందిన గోల్కొండ రాజవర్ధన్ రెడ్డి డ్రైవరుగా పనిచేసేందుకు సౌదీ అరేబియా దేశానికి వెళ్లి అక్కడ వ్యవసాయ క్షేత్రంలో గొర్రెలు కాస్తూ పడుతున్న అగచాట్లు తాజాగా వెలుగుచూశాయి.

- సిద్దిపేట జిల్లా ఇరుకోడు గ్రామానికి చెందిన గోల్కొండ రాజవర్ధన్ రెడ్డి సౌదీ అరేబియాలోని హాయిల్ ప్రాంతంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో చిక్కుకున్నాడని, అతన్ని రక్షించి స్వదేశానికి తెప్పించాలని అతని తల్లి లక్ష్మి వేడుకున్నారు. మంగళవారం హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్ లో 'ప్రవాసీ ప్రజావాణి' లో ఈ మేరకు లక్ష్మీ ఫిర్యాదు చేశారు.తన కుమారుడు డ్రైవరు పని ఇప్పిస్తామని చెప్పి సౌదీ అరేబియా దేశానికి తీసుకువెళ్లి గొర్రెలు కాయమన్నారని లక్ష్మీ ఆవేదనగా చెప్పారు. లక్ష్మీ వెంట గల్ఫ్ కార్మిక సంఘం నాయకులు మంద భీంరెడ్డి, మహ్మద్ బషీర్ అహ్మద్ ఉన్నారు.

డ్రైవరు వీసాపై వెళ్లి...
రాజవర్ధన్ ను ఆరు నెలల క్రితం డ్రైవర్ వీసాపై సౌదీకి తీసికెళ్లిన ఏజెంట్ గొర్రెల కాపరిగా, ఇతర వ్యవసాయ పనులు చేయిస్తున్నాడని అతని తల్లి లక్ష్మీ ఫిర్యాదులో పేర్కొన్నారు.తన కుమారుడిని సౌదీలో శారీరకంగా ,మానసికంగా హింసిస్తున్నారని తల్లి లక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ సీఎం ఏ.రేవంత్ రెడ్డి చొరవతీసుకుని తన కుమారుడిని సౌదీ యజమాని చెర నుంచి విడిపించాలని ఆమె కోరారు. సౌదీకి తీసికెళ్లిన ఎజెంటే సూపర్ వైజర్ గా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని లక్ష్మీ వాపోయారు.


Read More
Next Story