Komatireddy Venkata Reddy | ‘తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడటం వేస్ట్’
తెలంగాణలో తీన్మార్ మల్లన్న ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న మల్లన్న.. కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో తీన్మార్ మల్లన్న ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న మల్లన్న.. కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన నివేదికపై కూడా మల్లన్న అత్యంత దారుణంగా మాట్లాడారు. అతని తీరును సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్.. ఇప్పటికే మల్లన్నకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు అతని గురించి మాట్లాడే అంత టైమ్ తనకు లేదని, అసలు మల్లన్న గురించి మాట్లాడటం ఒక టైమ్ వేస్ట్ పని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగానే తీన్మార్ మల్లన్న అంశంపై స్పందించారు.
‘‘తీన్మార్ మల్లన్న విషయంలో మాట్లాడే అంత సమయం నాకు లేదు. మాట్లాడటం కూడా వేస్ట్. తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ, ఏఐసీసీ, క్రమశిక్షణ ఛైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చినట్లు వార్తల్లో చూశాను. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వేలో 56.6శాతం బీసీలు ఉన్నట్లు తేల్చాం. బడుగు బలహీన వర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే బీసీలకు పార్టీ పరంగా కచ్ఛితంగా 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. వర్గీకరణ విషయంలో కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. 90శాతం ఉన్న జనాభా కోసమే తెలంగాణ వచ్చింది. దొరలు, భూస్వాములు ఫామ్ హౌస్‌లో ఉండటానికి కాదు. ఫామ్ హౌస్‌లో ఉంటూ కులగణనలో పాల్గొనకుండా ఉన్న వాళ్లకు ఈ సర్వేపై మాట్లాడే హక్కు లేదు. బీఆర్ఎస్ తరహాలో మేము హడావిడీగా సర్వే చేయలేదు. తాము చేసిన ప్రజల ముందు పెట్టాం’’ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.