ఈ టీచర్ చేసినపనికి అందరు షాక్
x
Teacher become barber

ఈ టీచర్ చేసినపనికి అందరు షాక్

తరగతి గదిలో చెప్పినమాట వినలేదని ఒక టీచర్ విద్యార్ధుల విషయంలో పైశాచకంగా వ్యవహరించింది.


తరగతి గదిలో చెప్పినమాట వినలేదని ఒక టీచర్ విద్యార్ధుల విషయంలో పైశాచకంగా వ్యవహరించింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని పేరువంచ గ్రామంలో జిల్లా పరిషత్ స్కూలుంది. అందులోని ఒక తరగతిలోని పిల్లలు మాట వినటంలేదని ఒక టీచర్ బార్బర్ లాగ మారిపోయి కొందరికి ఇష్టంవచ్చినట్లు జుట్టు కత్తిరించేసింది. ఉదయం స్కూలుకు చక్కగా వెళ్ళిన పిల్లలు విచిత్రమైన హైర్ స్టైల్ తో భోరున ఏడుస్తు ఇంటికి రావటంతో తల్లి, దండ్రులు ఆశ్చర్యపోయారు.

ఇంతకీ విషయం ఏమిటంటే పేరువంచలోని జిల్లా పరిషత్ స్కూల్లో ఒక క్లాసులో చదువుతున్న పిల్లల్లో కొందరికి జుట్టు బాగా పెరిగిపోయిందట. జుట్టు కత్తిరించుకురావాలని టీచర్ చాలా రోజులుగా చెబుతోంది. అయినా పిల్లలు ఆమెచెప్పింది వినలేదు. దాంతో ఒళ్ళుమండిపోయిన టీచర్ శనివారం ఉదయం క్లాసుకు వెళ్ళగానే 8 మంది విద్యార్ధులను లేపి నిలబెట్టింది. ఒక కత్తెర తెప్పించింది. ఒక్కొక్కళ్ళని కూర్చోబెట్టి తనిష్టం వచ్చినట్లుగా జుట్టు కత్తిరించి పడేసింది.

పిల్లల జుట్టును కత్తిరించిన తర్వాత కాని టీచర్ కోపం చల్లారలేదు. పాఠాలు చెప్పాల్సిన టీచర్ బార్బర్ లాగ జుట్టుకత్తిరించేయటంతో పిల్లల క్రాఫింగ్ విచిత్రంగా తయారైంది. పేలు కొరికేసిన తలలో జుట్టు ఎలాగుంటుందో పిల్లల క్రాఫింగ్ అలా తయారైంది. 8 మందికి జుట్టు కత్తిరించేసిన టీచర్ వాళ్ళందరినీ ఇళ్ళకు వెళ్ళమన్నది. ఇంటికి వచ్చిన పిల్లల హైర్ స్టైల్ చూసిన తల్లి, దండ్రులు ఆశ్చర్యపోయారు. ఏమి జరిగిందని అడగటంతో పిల్లలు భోరుమంటు జరిగిందంతా చెప్పారు. దాంతో మండిపోయిన తల్లి, దండ్రులు వెంటనే పిల్లలను తీసుకుని స్కూలుకు వెళ్ళి హెడ్ మాస్టర్ కు చూపించి పెద్ద గొడవే చేశారు.

పిల్లలకు సక్రమంగా పాఠాలు చెప్పకుండా జుట్టు కత్తిరించటం ఏమిటంటు హెడ్ మాస్టర్ ముందే టీచర్ను నిలదీశారు. తల్లి, దండ్రులకు, టీచర్ కు మాట మాట పెరగింది. వెంటనే హెడ్ మాస్టర్ కల్పించుకుని గొడవ పెద్దది కాకుండా సర్దిచెప్పి తల్లి, దండ్రులను పంపేశారు. చేసేదిలేక పిల్లలకు తల్లి, దండ్రులు పూర్తిగా గుండుకొట్టించేశారు.

Read More
Next Story