
ఉత్కంఠగా సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
ఇంకా దాదాపు 1,33,000 వేల ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది.
కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియా ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికి మూడు రౌండ్ల లెక్కింపు పూర్తయినప్పటికీ ఉత్కంఠ మాత్రం ఏమాత్రం వీడటం లేదు. మూడో రౌండ్లో అధికారులు మొత్తం 63వేల ఓట్లను లెక్కించారు. ఇప్పటి వరకు జరిగిన లెక్కింపలను గమనిస్తే బీజేపీ నేత అంజిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అంజిరెడ్డికి 23,310 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 18,812 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణకు 15,880 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రస్తుతం అంజిరెడ్డి 4,498 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా దాదాపు 1,33,000 వేల ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. చివరి వరకు ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపుతో విజేత ఎవరో తేలే ప్రసక్తే లేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం ఎవరిని వరిస్తుందనేది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.