పార్టీకి తీన్మార్ తలనొప్పిగా మారాడా ?
x
Teenmar Mallanna

పార్టీకి తీన్మార్ తలనొప్పిగా మారాడా ?

షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాల్సొస్తే ఎవరికి ఇవ్వాలో సమాధానం వాళ్ళకే ఇస్తానని అన్నారు.


కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న పెద్ద తలనొప్పిగా మారాడా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే క్రమశిక్షణ చర్యల కింద పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరంలేదన్నాడు. షోకాజ్ నోటీసును తాను లెక్కకూడా చేసేదిలేదని తెగేసి చెప్పాడు. షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాల్సొస్తే ఎవరికి ఇవ్వాలో సమాధానం వాళ్ళకే ఇస్తానని అన్నారు. ఇంతకీ తీన్మార్ మల్లన్న సమాధానం ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నడనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల లోకల్ బాడీ ఎన్నికల కోటాలో పోటీచేసి గెలిచిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచేంతవరకు చాలా కామ్ గా ఉన్న తీన్మార్(Teenmar Mallanna) తర్వాత నుండి గోల మొదలుపెట్టాడు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి(Revanth)ని అడుగడుగున నిలదీస్తున్నాడు. రేవంత్ పాలనను బహిరంగంగానే విమర్శిస్తు, ఆరోపణలతో రెచ్చిపోతున్నాడు. తాజాగా కులగణన రిపోర్టు(Cast Survey) కాపీని బహిరంగంగా నిప్పుపెట్టి పార్టీలో అగ్గి రాజేశాడు. అసలే కులగణన రిపోర్టుపై ప్రతిపక్షాలు మండిపోతున్న సమయంలో తీన్మార్ మల్లన్న కూడా రిపోర్టు అంతా బోగస్ అని బహిరంగంగా ఆరోపించటం ప్రతిపక్షాల ఆయుధం ఇచ్చినట్లయ్యింది.

రిపోర్టును తగలబెట్టినందుకు పార్టీ క్రమశిక్షణ సంఘం తీన్మార్ కు షోకాజ్ నోటీసు జారీచేసింది. మొన్నటి 12వ తేదీలోగా సమాధానం చెప్పాలని నోటీసులో స్పష్టంగా చెప్పినా ఎంఎల్సీ పట్టించుకోలేదు. ఇపుడు విషయం ఏమిటంటే బీసీ సామాజికవర్గానికి చెందిన తీన్మార్ పై పార్టీ చర్యలు తీసుకోలేకపోతోంది. ఇదేసమయంలో ప్రభుత్వం, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని నియంత్రించలేకపోతోంది. కాంగ్రెస్ ఎంఎల్సీ(Congress MLC)గా ఉంటూనే తీన్మార్ స్వపక్షంలో విపక్షంగా తయారయ్యాడు. మరి తీన్మార్ విషయాన్ని రేవంత్ ప్రత్యేకంగా అధిష్ఠానంతో మాట్లాడి డీల్ చేస్తారేమో చూడాలి. అప్పటివరకు తీన్మార్ వల్ల పార్టీకి తలనొప్పులు తప్పేట్లులేదు.

Read More
Next Story