మహిళా కమిషన్ ఎదుటకు తీన్మార్ మల్లన్న లొల్లి
x

మహిళా కమిషన్ ఎదుటకు తీన్మార్ మల్లన్న లొల్లి

చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో కమిషన్ సభ్యులకు ఫిర్యాదు


తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాగృతి మహిళానాయకులు డిమాండ్ చేశారు జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఎల్సి తీన్మార్. ఈ మేరకు తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

చైర్మన్ నేరెళ్ల మాదవి అందుబాటులో లేకపోవడంతో ఫిర్యాదును కమిషన్ సభ్యులకు ఇచ్చారు.

తాము తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు ఇవ్వనున్నట్లు కమిషన్ చైర్మన్ కు ముందే తెలియజేశామని , ఎంఎల్సీ హోదాలో ఉన్నమహిళను కించపరిచే వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఫిర్యాదు స్వీకరించడానికి కమిషన్ వెనుకాడుతున్నట్లు మహిళా నాయకులు ఆరోపించారు. జాగృతి నాయకులు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించామని చైర్మన్ దృష్టికి తెస్తామని కమిషన్ సభ్యులు తెలిపారు.

Read More
Next Story