గర్రెపల్లిలో చారిత్రక విచిత్రం, అష్టమహిషుల వేణుగోపాల శిల్పం
x

గర్రెపల్లిలో చారిత్రక విచిత్రం, అష్టమహిషుల వేణుగోపాల శిల్పం

వేణుగోపాలుని వెనక మయూరతోరణంలో కృష్ణుని అష్టమహిషుల విగ్రహాలు కనిపించడం అరుదు


తెలంగాణ పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలోని దేవాలయంలో అరుదైన, కొత్తరూపుతో కనిపించే వేణుగోపాలస్వామి శిల్పాన్ని కొత్త తెలంగాణచరిత్రబృందం సభ్యుడు కుందారపు సతీశ్ గుర్తించాడు.

అర్ధమంటపంతో అగుపించే వేణుగోపాలస్వామి దేవాలయంలో కరండమకుటంతో, తల వెనక ప్రభావళితో, చెవులకు జూకాలతో, మెడలో హార, గ్రైవేయకాలతో, భుజభూషణాలతో, మువ్వల మేఖలతో, ఉరుడాలతో, జయమాలతో, కరకంకణాలతో, పాదమంజీరాలతో, పాదాంగుళ్యాలతో కుడివైపున రెండుచేతులతో వేణువును పట్టుకుని, వేణువాదనచేస్తున్న వేణుగోపాలస్వామి స్వస్తికాసనంలో నిల్చునివున్నాడు.
తన కిరువైపుల నీల, భూదేవిలున్నారు. ఎక్కడైనా కేశవస్వామి, వేణుగోపాలస్వామి శిల్పాల తోరణంలో దశావతారాలుండడం చూస్తాం.కాని, ఇక్కడ దానికి భిన్నంగా వేణుగోపాలుని వెనక మయూరతోరణంలో కృష్ణుని అష్టమహిషుల విగ్రహాలు చెక్కివున్నాయి.శైలిలో, శిల్పవైవిధ్యతలో ఈ వేణుగోపాలస్వామి శిల్పం అరుదైనది. అపురూపమైనది. కళ్యాణీచాళుక్యుల కాలంనాటి 12వ శతాబ్దపు శిల్పం.

అదే గర్భగుడిలో యోగశయనమూర్తి శిల్పం ప్రత్యేకం ప్రముఖ చారిత్రక పరిశోధకుడు , కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.


Read More
Next Story