తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఫిక్స్
x

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఫిక్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. అసెంబ్లీ సమావేశం అనంతరం స్పీకర్ ఛాంబర్ లో బీఎస్సీ మీటింగ్ జరిగింది.


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. అసెంబ్లీ సమావేశం అనంతరం స్పీకర్ ఛాంబర్ లో బీఎస్సీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌ లు, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బలాల హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు.

జులై 31 వరకు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో మొత్తం ఎనిమిది రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జులై 25న ఆర్థికశాఖమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జులై 26, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. జులై 31న ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపనున్నారు. రేపు అసెంబ్లీలో రైతు రుణమాఫీపై చర్చ జరగనుంది. జాబ్ క్యాలెండర్ పైనా ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

కాగా నేడు (మంగళవారం) ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు అసెంబ్లీ నివాళి అర్పించిన తర్వాత సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన లాస్య నందితకి సభలోని సభ్యులందరూ సంతాపం తెలియజేశారు. లాస్య నందిత మృతిపై సంతాప తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.




Read More
Next Story