
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సస్పెన్షన్
స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనను సస్పెండ్ చేశారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈరోజు జరిగిన సమావేశాల్లో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు గానూ ఎమ్మెల్యేను స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలోనే బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనకు స్పీకర్ ఆమోదం తెలిపారు.