Telangana |కేంద్ర ఓబీసీ జాబితాలో 40 కులాలు,బీసీ కమిషన్ తీర్మానం
x

Telangana |కేంద్ర ఓబీసీ జాబితాలో 40 కులాలు,బీసీ కమిషన్ తీర్మానం

తెలంగాణ బీసీ జాబితాలో ఉండి కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చని 40 కులాలను వెంటనే కేంద్ర జాబితాలో చేర్చాలని కోరుతూ బీసీ కమిషన్ తీర్మానించింది.


తెలంగాణ బీసీ కమిషన్ (Telangana BC Commission)శుక్రవారం నాడు సంచలన తీర్మానం చేసింది. తెలంగాణలో బీసీ జాబితాలో ఉండి ఓబీసీ జాబితాలో లేని 40 కులాలను చేర్చాలని బీసీ కమిషన్ తీర్మానించింది. తెలంగాణలో బీసీ కమిషన్ ఇటీవల పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో జరిపిన బహిరంగ విచారణలలో వచ్చిన వినతులను కమిషన్ ఖైరతాబాదు లోని కార్యాలయంలో సమీక్షించి, ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.


- రాష్ట్ర బీసీ జాబితాలో 130 కులాలు ఉండగా, కేంద్ర ఓబీసీ జాబితాలో రాష్ట్రానికి చెందిన 90 కులాలు మాత్రమే ఉన్నాయి. (40 castes in the Central OBC list
)కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చని 40 కులాలను కేంద్ర జాబితాలో కలిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రతిపాదనలు పంపినప్పటికీ, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.

బహిరంగ విచారణలో వచ్చిన వినతులపై...
తొలి విడతలో అక్టోబరు 28 నుంచి నవంబరు 2 వరకు, రెండవ విడతలో నవంబరు 18 నుంచి 26వతేదీ వరకు బీసీ కమిషన్ బహిరంగ విచారణ జరిపిన విషయం తెలిసిందే. దొమ్మర, పిచ్చకుంట్ల, బుడబుక్కల, తమ్మలి తదితర కులాల పేర్లలో మార్పులను కోరుతూ వచ్చిన వినతుల పట్ల బీసీ కమిషన్ సానుకూలంగా స్పందించింది.బీసీ కమిషన్ ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ తరువాత ప్రభుత్వానికి తమ సిఫారసులు అందించాలని నిర్ణయించింది. ఈ విషయంలో ప్రజాభిప్రాయాలు కోరుతూ కమిషన్ ఒక నోటిఫికేషన్ జారీ చేసి నెల రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించనుంది. ఇంకా వివిధ అంశాలపై తగు పరిశీలనలు చేసి ప్రభుత్వానికి నివేదించాలని బీసీ కమిషన్ నిర్ణయించింది.

ముస్లిం బీసీల రిజర్వేషన్ పెంచండి : ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వినతి
అంతకుముందు బీసీ వెల్ఫేర్ శాఖ సెక్రెటరీ ఇ. శ్రీధర్, ఐఏఎస్ కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్,సభ్యులతో భేటీ అయి వివిధ అంశాలు చర్చించారు. కమిషన్ సమావేశం అనంతరం అక్బరుద్దీన్ నేతృత్వంలో ఎం.ఐ.ఎం ప్రజాప్రతినిధుల బృందం కమిషన్ తో భేటీ అయి ముస్లింలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపై వినతి పత్రం సమర్పించారు.


Read More
Next Story