Telangana | నేటి నుంచి బీర్ల ధరలు పెంపు, కమిటీ సిఫార్సు అమలు
x
నేటి నుంచి పెరిగిన బీర్ల ధరలు

Telangana | నేటి నుంచి బీర్ల ధరలు పెంపు, కమిటీ సిఫార్సు అమలు

తెలంగాణలో మందుబాబులకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ షాక్ ఇచ్చింది. మంగళవారం నుంచి బీర్ల ధరలను 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.


వేసవికాలం వస్తుందంటే చాలు మద్యం ప్రియులు చల్లటి ఛిల్ అందించే బీర్ల కోసం ఎగబడుతుంటారు. వేసవిలో బీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ రాస్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మంగళవారం నుంచి 15 శాతం బీర్ల ధరలు పెంచుతూ సంచలన నిర్ణయం తీసకుంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ డిపోల వద్ద ఉన్న బీర్ల స్టాకు, రవాణాలో ఉన్న బీర్లకు పెంచిన ధరలు వర్తిస్తాయని టీజీబీసీఎల్ ప్రకటించింది.


ముగ్గురు సభ్యుల ధరల స్థిరీకరణ కమిటీ సిఫార్సు
తెలంగాణ రాస్ట్రంలో ధరల స్థిరీకరణకు రిటైర్డు జడ్జి జైస్వాల్ ఆధ్వర్యంలో ధరల నిర్ణయ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ తాజాగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. కమిటీ సిఫార్సు మేరకు బీర్ల ఉత్పత్తి దారులకు ప్రస్థుతం ఉన్న ఎమ్మార్పీ ధరపై 15 శాతం పెంచుతూ మంగళవారం నుంచి అమలులోకి తీసుకువచ్చింది.

యూబీఐ కంపెనీ ప్రకటనతో...
బీర్ల ఉత్పత్తిలో తమకు ఎలాంటి లాభం లేకుండా పోయిందని, తాము బీర్ల ఉత్పత్తిని నిలిపివేస్తామని యూబీఐ కంపెనీ గతంలో ప్రకటించింది. దీంతో ప్రభుత్వం బీర్ల ధరల నిర్ణయం కోసం కమిటీని నియమించింది. తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బీర్ల ధరలు పెంచారు. వేసవి తాపానికి చల్లటి బీర్లు తాగి సేద తీరుదామనుకున్న మందుబాబులకు ఈ ధరల పెంపు షాక్ ఇచ్చింది. ధరల పెంపు, బకాయిల చెల్లింపులను పరిష్కరిస్తామని టీజీ బీసీఎల్ హామి ఇవ్వడంతో తాము బీరు సరఫరాను పునర్ ప్రారంభిస్తామని యూబీ గ్రూప్ తెలిపింది.


Read More
Next Story