Mahesh Kumar Goud
x

‘దొంగ ఓట్లే బీజేపీని గెలిపించాయి’

నిజామాబాద్‌లో దొంగ ఓట్లు ఉన్నాయని తాను నిరూపిస్తానన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్.


తెలంగాణలోని బీజేపీ ఎంపీల గెలుపుపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ సహా బీజేపీ ఎంపీలంతా కూడా దొంగ ఓట్ల సహాయంతోనే విజయం సాధించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో బీహార్‌లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారన్న తన మాటలకు తాను కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. తెలంగాణ బీజేపీ ఎంపీల గెలుపుపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలోనే వారి గెలుపును పునఃపరిశీలించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని వివరించారు. నిజామాబాద్ జిల్లాలో కూడా దొంగ ఓట్లు ఉన్నాయని, దానిని తాను నిరూపిస్తానని అన్నారు.

మహారాష్ట్రలో కోటి దొంగ ఓట్లు ఉన్నాయని మహేష్ కుమార్ ఆరోపించారు. నిజామాబాద్‌లో అనేక మంది మహారాష్ట్ర ప్రజలకు ఓట్లు ఉన్నాయని, కరీంనగర్‌లోని ఓ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో 69 ఓట్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఓట్ల చోరీ చేయాల్సిన అవసరం ఉన్నది బీజేపీకి మాత్రమేనని ఆరోపించారు. కానీ బీహార్ ఎన్నికల్లో బీజేపీ చేసే ఇలాంటి చిల్లర రాజకీయాలకు తావు ఉందని అన్నారు. ఎటువంటి అవకతవకలకు స్థానం లేకుండా బీహార్ ఎన్నికలకు ప్రజలను చైతన్యపరచననున్నామని, అందుకోసమే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని ఆయన వివరించారు. రాహుల్ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, బీహార్‌లో కాంగ్రెస్ ప్రభంజనం రావడం తథ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Read More
Next Story