తెలంగాణ చండికాంబ గుడిమెట్టు శాసనం ఏమి చెబుతున్నది?
x

తెలంగాణ చండికాంబ గుడిమెట్టు శాసనం ఏమి చెబుతున్నది?

కొలనుపాకలో చండికాంబగుడి అంతరాళం మెట్టు మీద కాకతీయ శాసనం.



కొలనుపాక క్షేత్ర సందర్శన చేసిన కొత్త తెలంగాణచరిత్రబృందం కొలనుపాక సోమేశ్వరాలయ ప్రాంగణంలోని చండికాంబగుడి అంతరాళం మెట్టు మీద కాకతీయ శాసనాన్ని గుర్తించింది. శాసనం 13వ శతాబ్దపు తెలుగులిపిలో, తెలుగుభాషలో రాయబడ్డది. గుడిమెట్టుగా పెట్టినందువల్ల రెండువైపుల మాత్రమే శాసనం కనిపిస్తున్నది. శాసనంలో వరంగల్లు స్వయంభూదేవుని ఆరాధించే కాకతీయ మహారాజు గణపతిదేవుడు అనుమకొండపురవరేశ్వరునిగా పేర్కొనబడ్డాడని ఈ వివరాలను కొత్త తెలంగాణచరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు..






శాసనస్తంభం గుడిమెట్టుగా గోడలకిందకు పరిచిపెట్టడంవల్ల శాసనం పూర్తిగా లభించలేదు. శాసనస్తంభాన్ని గుడిమెట్టుగా తొలగించి, కొలనుపాక మ్యూజియంలో పెట్టించాలని కొత్త తెలంగాణచరిత్రబృందం తెలంగాణ వారసత్వశాఖను కోరుతున్నది.






శాసనపాఠం:
మొదటి వైపు:
1. ........
2. ......సమధి
3. గత పంచమ
4. హాశబ్ద మ
5. హామండలేశ్వ
6. ర అనుమకొండ
7. పురవరేశ్వరం ప
8. రమమాహేశ్వ
9. రం శ్రీ స్వయం
10. భూదేవర దివ్య
11. శ్రీ పాదపదు
12. మారాధక..
13. బలిక్రితాంత
14. ...గజసె..
రెండవ వైపు:
1. ..
2. .......ణ..
3. రాజమా...
4. ..చ(ల)మ
5. ర్తిగండ...
6. ...య..గ
7. బెం.....ల
8. శ్రీమతు
9. కాకతీయ
10. గణపతి
11. దేవ మ
12. హారా(జ)
13. ...అను
14. మకొండ





Read More
Next Story