స్కిల్ యూనివర్సిటీపై నాదెళ్లతో రేవంత్ భేటీ..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్లతో భేటీ అయ్యారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్లతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని సత్య నాదెళ్ల నివాసానికి సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి వెళ్లారు. సత్యానాదెళ్లకు పుష్ప గుచ్చందించి విష్ చేశారు. అనంతరం వారు పలు కీలక అంశాలపై నాదెళ్లతో చర్చించారు. ఇందులో తెలంగాణలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టే అంశం కూడా ఉంటుంది. తెలంగాణలో దాదాపు 6 డాటా కేందరాలను ఏర్పాటు చేయనున్నట్లు మైక్రరోసాఫ్ట్ ప్రకటించింది. వీటిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దాంతో పాటుగానే తెలంగాణలో ఏర్పాటీ చేయాలనుకున్న స్కిల్ యూనివర్సిటీ, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి వాటి ప్రస్తావన కూడా వచ్చింది. కాగా స్కిల్ యూనివర్సిటీ గురించి తెలుసుకున్న సత్యానాదెళ్ల అదొక అద్భుతమైన కార్యక్రమం అని తెలిపారు. వృత్తి నైపుణ్యత సాధించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం రేవంత్ వివరించారు.
మైక్రోసాఫ్ట్ విషయంలో తెలంగాణ మొదటి నుంచి సానుకూలంగా ఉంది. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సెంటర్ ఏర్పాటయితే దాదాపు 4వేల ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. ఈ మేరకు ఇటీవల ఒప్పందాలు కూడా జరిగాయి. దీనికి సంబంధించిన పురోగతిపై సీఎ రేవంత్.. సత్యనాదెళ్లతో చర్చించినట్లు సమాచారం.ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ఏర్పాటుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను కూడా నాదెళ్లకు సీఎం వివరించినట్లు సమాచారం. తెలంగాణలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, నిరుద్యోగ సమస్య కూడా కాస్త తగ్గుందని వివరించారని, అందుకు సత్య సానుకూలంగా స్పందించినట్లు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.