Telangana|రైతులకు సీఎం శుభవార్త, సంక్రాంతిలోగా రైతు భరోసా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆదివారం రైతులకు శుభవార్త వెల్లడించారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా వేస్తామని సీఎం ప్రకటించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతి అని తాము నిరూపించుకున్నామని సీఎం ఏ రేవంత్ రెడ్డి చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా వేస్తామని సీఎం తెలిపారు.ఇందిరమ్మ ప్రభుత్వంలో సోనియమ్మ గ్యారెంటీ అమలు అయి తీరుతుందని సీఎం వివరించారు.ఎలాంటి మారిషులు వచ్చి అబద్దాలు చెప్పినా రైతులు నమ్మవద్దని సీఎం కోరారు.
- రైతు భరోసా విధివిధానాలపై మంత్రివర్గ ఉప సంఘం వేశామని సీఎం రేవంత్ తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా విధి విధానాలపై చర్చించి ఖరారు చేస్తామని సీఎం చెప్పారు.రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపించామని, రైతు భరోసా కూడా ఇచ్చి తీరుతామని సీఎం వివరించారు.
వచ్చే సీజనులో కూడా ధాన్యానికి బోనస్
సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ పై కొందరు అపోహలు సృష్టించారని, వరి కొనుగోలు కేంద్రాలను మూసి వేస్తామని, వరి వేసుకుంటే ఉరేనని కేసీఆర్ గతంలో అన్నారని సీఎం చెప్పారు.తమ ప్రభుత్వం మాత్రం సన్న వడ్లు పండించండి బోనస్ ఇస్తామని చెపుతోంది..ఇప్పటి వరకు 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తమ ప్రభుత్వం సేకరించిందని, వచ్చే సీజన్ లో కూడా 500 రూపాయల బోనస్ కొనసాగుతుందని సీఎం తెలిపారు.తెలంగాణ సోనా, బీపీటీ ,హెచ్ ఎం టీ లాంటి వంగడాలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని,తెలంగాణ భూముల్లో పండే ధాన్యాన్నే పేదలకు రేషన్ దుకాణాల్లో ఇవ్వాలని అనుకుంటున్నామని సీఎం వివరించారు.సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడతామని చెప్పారు.
అప్పు ఉన్నా గ్యారంటీలు అమలు చేస్తున్నాం...
‘‘ రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో రూ69 వేల కోట్ల అప్పులతో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది..కేసీఆర్ నుంచి కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల అప్పు తో మా ప్రభుత్వం ఏర్పడింది..ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు పైన నెలకు 6500 కోట్ల మిత్తి చెల్లించే పరిస్థితి ఉంది..ఏడు లక్షల కోట్ల అప్పు ఉందన్న సంగతి ఏ సందర్భంలో కూడా కేసీఆర్ ,హరీష్ రావు, ఈటెల రాజేందర్ ప్రజలకు చెప్పలేదు,అద్భుతమైన పరిపాలనను అందిస్తున్నామని, బంగారు తెలంగాణగా మారుస్తున్నామని అబద్దాలు చెప్పారు’’ అని సీఎం రేవంత్ చెప్పారు.రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికి అధైర్య పడకుండా ఇచ్చిన గ్యారంటీల ను అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు.
రుణమాఫీ చేశాం
‘‘రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎరువులు, మద్దతు ధర , ఉపాధి హామీ పథకం లాంటి వాటితో రైతులను ఆదుకుంటున్నాం..2023 వానాకాలం రైతు బంధు కేసీఆర్ ఎగ్గొట్టారు.. మేం అధికారంలో రాగానే 7625 కోట్ల రూపాయలను రైతు బంధు కింద చెల్లించాం,ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేశాం..మొత్తంగా 25,35,964 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం’’అని సీఎం చెప్పారు.
Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy will Address the Media at Residence,Hyderabad https://t.co/iK0X3jNND5
— Telangana CMO (@TelanganaCMO) December 1, 2024
Next Story