తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇదే!
x
TPCC Screening committee Meeting

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇదే!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ఖరారైంది. ఢిల్లీ పెద్దల ఆమోద ముద్ర పడడంతోనే బయట పెడతారు.


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వడపోత ప్రారంభమైంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న దాదాపు 400 మంది అభ్యర్థుల వివరాలను, వారికున్న అనుభవం, కులం, పలుకుబడి, డబ్బు దస్కాన్ని పరిగణలోకి తీసుకుని పార్టీ స్క్రీనింగ్ కమిటీ పరిశీలన మొదలు పెట్టింది. రోజంతా కసరత్తు చేసిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి మూడు పేర్లను ఖరారు చేసి పార్టీ అధిష్టానానికి పంపింది.

గాంధీభవన్ లో జరిగిన సమావేశం అనంతరం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయబోతున్నామన్నారు. 13, 14 లోక్ సభ సీట్లు కచ్చితంగా గెలుస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా దాదాపు ఇదే మాట చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ వచ్చే ఎన్నికల్లో కలిక్కానికి కూడా కానరావన్నారు. బీఆర్ఎస్ కు ఒక్కసీటూ రాదని తేల్చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో మొత్తం పార్లమెంటు నియోజకవర్గాలు 17. ఇందులో ఒక సీటు కచ్చితంగా ఎంఐఎం గెలుస్తుందనేది జగమెరిగిన సత్యమే. ఆ సీటు హైదరాబాద్. ఇక బీజేపీ సికింద్రాబాద్ లో గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులకు ఏదైనా సీటు ఇస్తుందేమో చూడాలంటున్నారు. అయితే ఆ చాన్స్ కనిపించడం లేదు.

కాంగ్రెస్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం పార్టీ అధిష్టానానికి పంపిన పేర్ల జాబితా ఇలా ఉంది..

1. వరంగల్ (ఎస్సీ)

- అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య , మోత్కుపల్లి నర్శింహులు

2. నాగర్ కర్నూల్ (ఎస్సీ)

- సంపత్ కుమార్, మల్లు రవి, చారకొండ వెంకటేశ్‌

3. ఆదిలాబాద్ (ఎస్టీ)

- నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్, రేఖా నాయక్

4. మహబూబాబాద్ (ఎస్టీ)

- బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, విజయ బాయి

5. ఖమ్మం (జనరల్)

-రేణకాచౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, వీహెచ్‌, మల్లు నందిని / (సోనియా గాంధీ)

6. హైదరాబాద్ (జనరల్)

- సమీర్ ఉల్లా ,సూరం దినేష్ ,ఆనంద్ రావు (ఎంబీటీ)

7. కరీంనగర్ (జనరల్)

- ప్రవీణ్‌ రెడ్డి, రోహిత్ రావు , నేరెళ్ల శారద

8. పెద్దపల్లి (ఎస్సీ )

- గడ్డం వంశీ, వెంకటేశ్ నేత

9. నిజామాబాద్ (జనరల్)

-ఈరవత్రి అనిల్, జీవన్ రెడ్డి (ఎమ్మెల్సీ), సునీల్ రెడ్డి (ఆరెంజ్ ట్రావెల్స్ )

10. మెదక్ (జనరల్)

- జగ్గారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు

11. జహీరాబాద్ (జనరల్)

- సురేష్ షెట్కార్, త్రిష (మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె )

12. మల్కాజిగిరి (జనరల్)

-బండ్ల గణేష్, హరివర్ధన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ

13. సికింద్రాబాద్ (జనరల్)

- అనిల్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్

14. చేవెళ్ల (జనరల్)

-చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి, దామోదర్ అవేలీ

15. మహబూబ్ నగర్ (జనరల్)

- వంశీ చంద్ రెడ్డి, జీవన్ రెడ్డి (ఎంఎస్ఎన్ ఫార్మా), సీతాదయాకర్ రెడ్డి,

16. నల్గొండ (జనరల్)

- జానారెడ్డి, రఘువీర్ రెడ్డి (జానారెడ్డి కొడుకు), పటేల్ రమేష్ రెడ్డి

17. భువనగిరి (జనరల్)

- చామల కిరణ్ కుమార్ రెడ్డి, పున్నా కైలాష్ నేత, పవన్ కుమార్ రెడ్డి

ఈ పేర్లను పరిశీలించి అధిష్టానం ఒకరి పేరును ఖరారు చేస్తుంది.

Read More
Next Story