ఢిల్లీ దర్బార్ పై కాంగ్రెస్ గాడిద గుడ్డు వీడియో
x

ఢిల్లీ దర్బార్ పై కాంగ్రెస్ 'గాడిద గుడ్డు' వీడియో

కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. కాంగ్రెస్ 'ఢిల్లీ దర్బార్' పేరుతో ఒక వీడియోను విడుదల చేసింది.


కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎన్నికల సమరం హోరా హోరీగా సాగుతోంది. ప్రచారంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. కాంగ్రెస్ ఇంకో అడుగు ముందుకేసి 'ఢిల్లీ దర్బార్' పేరుతో బీజేపీ పై ఒక వీడియోను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి చేసిన అన్యాయాలు ఇవే అని వీడియో ద్వారా వినూత్న ప్రచారం ప్రారంభించింది.


జీఎస్టీ నిధుల పంపిణీలో గుజరాత్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ శాతం నిధులు ఇచ్చిందని, తెలంగాణ కి తక్కువ నిధులు ఇచ్చి అన్యాయం చేస్తోందని వీడియో ద్వారా వివరించే ప్రయత్నం చేసింది. రేవంత్ రెడ్డి తన ప్రచారంలో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది గాడిద గుడ్డు తప్ప అని పదేపదే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా అకౌంట్స్ లోనూ తెలంగాణ ఏమడిగింది? బీజేపీ ఏమిచ్చింది గాడిద గుడ్డు తప్ప అని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియో లోనూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కి గాడిద గుడ్డు ఇచ్చినట్టు ప్రత్యేకంగా చూపించడం గమనార్హం.


ఈ "ఢిల్లీ దర్బార్" వీడియో ని తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ IncTelangana లో షేర్ చేశారు. కాంగ్రెస్ శ్రేణులు వీడియో ని లైక్ చేసి, షేర్ చేసుకుంటుండగా.. బీజేపీ అభిమానులు కామెంట్స్ లో కాంగ్రెస్ కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి లోక్ సభ ఎన్నికల ప్రచార వేళ తెలంగాణ రాష్ట్రంలో "గాడిద గుడ్డు" ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది.


తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాలో "ఢిల్లీ దర్బార్" వీడియోని జత చేస్తూ ఇలా రాసుకొచ్చింది...


సొమ్ము ఒకరిది - సోకు ఒకరిది అంటే ఇదేనేమో

తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుని,

గుజరాత్ కు అప్పనంగా అప్పజెబుతుంది ఢిల్లీ దర్బార్.


తెలంగాణ అడిగింది…

పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా

బీజేపీ ఇచ్చింది…

“గాడిద గుడ్డు”


తెలంగాణ అడిగింది…

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.

బీజేపీ ఇచ్చింది…

“గాడిద గుడ్డు”


తెలంగాణ అడిగింది…

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ

బీజేపీ ఇచ్చింది…

“గాడిద గుడ్డు”


తెలంగాణ అడిగింది…

కృష్ణా, గోదావరిలో వాటాల పంపకం

బీజేపీ ఇచ్చింది…

“గాడిద గుడ్డు”


తెలంగాణ అడిగింది…

మేడారం జాతరకు జాతీయహోదా

బీజేపీ ఇచ్చింది…

“గాడిద గుడ్డు”


తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు…

పదేండ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద “గాడిద గుడ్డు”.

Read More
Next Story